Asianet News TeluguAsianet News Telugu

ఒప్పంద సూత్రాలను తెలంగాణ ఉల్లంఘిస్తోంది.. కఠినచర్యలు తీసుకోండి..

‘శ్రీశైలం జలాశయం నుంచి జలవిద్యుత్తు ఉత్పత్తికి తెలంగాణ ఇక నుంచి నీళ్లు తీసుకోకుండా చూడాలి. తెలంగాణ యంత్రాంగాన్ని ఈ విషయంలో నిలువరించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని మరోసారి విన్నవిస్తున్నాం. ఎన్నిసార్లు వద్దని చెబుతున్నా జలవిద్యుత్తు ఉ్పత్తి ఆపకపోగా ఇంకా పెంచుతూనే ఉన్నారు. 

Andhrapradesh State letter to Krishna River Management Board - bsb
Author
Hyderabad, First Published Jun 30, 2021, 9:35 AM IST

‘శ్రీశైలం జలాశయం నుంచి జలవిద్యుత్తు ఉత్పత్తికి తెలంగాణ ఇక నుంచి నీళ్లు తీసుకోకుండా చూడాలి. తెలంగాణ యంత్రాంగాన్ని ఈ విషయంలో నిలువరించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని మరోసారి విన్నవిస్తున్నాం. ఎన్నిసార్లు వద్దని చెబుతున్నా జలవిద్యుత్తు ఉ్పత్తి ఆపకపోగా ఇంకా పెంచుతూనే ఉన్నారు. 

ఒక్క సోమవారమే (28-6-21) 16,877 క్యూసెక్కుల నీటిని జలవిద్యుత్తు కోసం తీసుకున్నారు. మరోవైపు వందశాతం జలవిద్యుత్తు ఉత్పత్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం జెన్ కోను ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అంటే శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్తు కేంద్రం నుంచి రోజుకు 4 టీఎంసీలు విద్యుత్తు ఉత్పాదన కోసం వాడేస్తారని అర్థం. ఇది ఆంద్రప్రదేశ్ ప్రయోజనాలను పూర్తిగా దెబ్బతీస్తుంది’ అని ఆంద్రప్రదేశ్ ఆందోళన వ్యక్తం చేసింది. 

ఈ మేరకు మరో లేఖను కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు మంగళవారం రాత్రి పంపింది. ఆంద్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్ సీ) సి. నారాయణ రెడ్డి ఈ మేరకు బోర్డు కార్యదర్శికి లేఖ రాశారు. 

‘వరదల సమయంలో మినహా మిగిలిన వేళల్లో శ్రీశైలం, నాగార్జున సాగర్ ఉమ్మడి జలాశయాల నుంచి బోర్డు ఆదేశాలు లేకుండా నీటిని తీసుకోవడనాికి వీల్లేదు. అయినా బోర్డు నుంచి ఎలాంటి ఆదేశఆలూ లేకుండానే తెలంగాణ ఏకపక్షంగా శ్రీశైలం నుంచి నీటిని తీసుకుంటోంది. కనీసం కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వడం లేదు. 

ఇది బోర్డు అధికారాలను గౌరవించకపోవడమే. ఉమ్మడి జలాశయాల నుంచి నీటి నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నిర్ణయాల ప్రకారం ముందుకు వెళ్లాలన్న ఒప్పంద సూత్రాలను ఉ్లంఘిచినట్లే’ అని ఈఎన్ సీ తన లేఖలో వివరించారు. 

‘జూన్ ఒకటితో ప్రారంభమైన కొత్త నీటి సంవత్సరంలో ఇంతవరకూ శ్రీశైలం జలాశయంలోకి 17.36 టీఎంసీల నీటి ప్రవాహాలు వచ్చాయి. అందులో 6.9టీఎంసీలను విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ వినియోగించుకుంది. మొత్తం నీటి ప్రవాహాల్లో ఇది 40 శాతం.

నాగార్జునసాగర్ జలాశయంలో ఖరీఫ్ అవసరాల కోసం అవసరమైన నీళ్లున్నా తెలంగాణ శ్రీశైలం నీళ్లను వాడేస్తోంది. సాగర్ జలాశయం కింద, కృష్ణా డెల్టాలో వ్యవసాయ అవసరాలకు నీరు వినియోగించుకునే క్రమంలోనే శ్రీశైలం జలవిద్యుత్తు ఉత్పత్తి చేపట్టాలి. 

ఇలా శ్రీశైలనం నుంచి నీళ్లు వాడుకుంటూ పోతే నీటి మట్టాలు పడిపోతాయి. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తీసుకోవడం చాలా ఆలస్యమవుతుంది. తెలంగాణ పూర్తి జలవిద్యుత్తు ఉత్పత్తి చేపడితే ఆంధ్రప్రదేశ్ కు ఎంతో నష్టం కలుగుతుంది. 854 అడుగుల నీటిమట్టం స్థాయికి నీళ్లు నిలిచే అవకాశం ఉండదు’ అని ఆ లేఖలో ఈఎన్ సీ పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయం నుంచి ఏ రోజు ఎంత నీటిని తెలంగాణ వినియోగించుకుందో తెలియజేసే వివరాలను ఆ లేఖకు జత చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios