ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట డిగ్రీలో తెలుగు మీడియంలో విద్యాబోధనను నిలిపివేయనుంది. ఇకపై ఇంగ్లీష్ మీడియంలోనే డిగ్రీలో విద్యా బోధన చేయనున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట డిగ్రీలో తెలుగు మీడియంలో విద్యాబోధనను నిలిపివేయనుంది. ఇకపై ఇంగ్లీష్ మీడియంలోనే డిగ్రీలో విద్యా బోధన చేయనున్నారు. 

ఇది ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంగ్లీషులోనే కోర్సులు నిర్వహిస్తారు. ప్రభుత్వ నిర్ణయంతో 65వేల మంది విద్యార్థుల మీద ప్రభావం పడుతుంది. ఉన్నత విద్యామీద సీఎం సమీక్షలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే ప్రాథమిక విద్యలోనే ఇంగ్లీష్ బోధన కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇక మీదట ఉన్నత విద్యలో కూడా ఇంగ్లీషును చేర్చాలని నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు డిగ్రీకాలేజీలు ప్రతిపాదనలు సమర్పించాలని ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇంటర్ వరకు తెలుగు మీడియంలో చదివి ఒక్కసారి ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్లడం అంటే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కుంటారని విమర్శలు వినిపిస్తున్నాయి.