గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన సీఎం జగన్

బుధవారమే గవర్నర్ ఆరోగ్య పరిస్థితి మీద వైద్యులతో మాట్లాడిన సీఎం జగన్ సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్చినట్లు వైద్యులు చెప్పారని అన్నారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఈ సందర్భంగా సీఎం జగన్ పేర్కొన్నారు. కాగా, 88యేళ్ల గవర్నర్ Bishwabhushan Harichandan నవంబర్ 17న మధ్యాహ్నం ఒంటిగంటకు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్ లో అడ్మిట్ అయ్యారని వైద్యులు పేర్కొన్నారు.

andhrapradesh cm ys jagan enquires about governor's health condition

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను పరామర్శించారు. శాసనసభ విరామ సమయంలో గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బుధవారమే గవర్నర్ ఆరోగ్య పరిస్థితి మీద వైద్యులతో మాట్లాడిన సీఎం జగన్ సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్చినట్లు వైద్యులు చెప్పారని అన్నారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఈ సందర్భంగా సీఎం జగన్ పేర్కొన్నారు. 

కాగా, 88యేళ్ల గవర్నర్ Bishwabhushan Harichandan నవంబర్ 17న మధ్యాహ్నం ఒంటిగంటకు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్ లో అడ్మిట్ అయ్యారని వైద్యులు పేర్కొన్నారు. అయితే, Governor‌ కు నవంబర్ 15న కోవిడ్ పాజిటివ్ గా తేలిందని, ప్రస్తుతం ఆయనకు ఆక్సీజన్ అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు.

కాగా, Andhra Pradesh గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ బుధవారం అస్వస్థతకు గురైన విసయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించారు. గచ్చిబౌలిలోని AIG Hospitals‌ లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు కరోనా సోకింది. తెలంగాణ రాష్ట్రంలోని హైద్రాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో గవర్నర్ చికిత్స తీసుకొంటున్నారు. బుధవారం నాడు ఉదయం ప్రత్యేక విమానంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరించదన్ చికిత్స కోసం హైద్రాబాద్ కు వచ్చారు. Biswabhusan Harichandan ను వైద్యుల బృందం పరీక్షిస్తోంది. . గవర్నర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వైద్యుల బృందం గవర్నర్ ను పరీక్షిస్తుందని ఆసుపత్రి తెలిపింది. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

ఈ నెల 15న  ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు corona సోకిందని వైద్యులు తెలిపారు. రెండు రోజులుగా గవర్నర్ జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఇవాళ ఉదయమే ఆయన ప్రత్యేక విమానంలో hyderabad లోని ఆసుపత్రిలో చేరారు.

ఏపీ గవర్నర్ ఇటీవలే ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన నాటి నుండి ఆయన అస్వస్థతతో ఉన్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ ఇటీవల కాలంలో ఎవరిని కలిశారో వారంతా  కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఏపీ గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారు. ఏపీ గవర్నర్ చికిత్స పొందుతున్న ఆసుపత్రి వైద్యులతో సీఎం జగన్ మాట్లాడారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై జగన్ ఆరా తీశారు.

YS Viveka Murder Case: కీలక పరిణామం... వైసిపి రాష్ట్ర కార్యదర్శి శివశంకర్ రెడ్డి అరెస్ట్?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు అధికంగా నమోదయ్యాయి. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల అదుపునకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొంది. రాత్రిపూట కర్ఫ్యూ తో పాటు పగటిపూట ఆంక్షలను విధించింది. దీంతో కరోనా కేసులు అదుపులోకి వచ్చాయి.

ఏపీ గవర్నర్ ను పరామర్శించిన తమిళి సై

ఏపీ గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్ కరోనాతో హైద్రాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం నాడు పరామర్శించారు. బిశ్వభూషణ్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై తమిళిసై ఆరా తీశారు. వైద్యులతో తమిళిసై మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని తమిళిసై సౌందరరాజన్  ఆదేశించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios