Asianet News TeluguAsianet News Telugu

ఖజానా ఖాళీ: బిల్లుల చెల్లింపులపై ఎల్వీ కీలక ఆదేశాలు

ఈ ఏడాది ఏప్రిల్ 1 కంటే ముందు మంజూరై ఇంకా ప్రారంభించని పనులను రద్దు చేయాలని  ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం అన్ని శాఖలను ఆదేశించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సీఎస్ ఈ నిర్ణయం తీసుకొన్నారు.

andhrapradesh chief secretary lv subramanyam key instructions on payment of bills
Author
Amaravathi, First Published May 30, 2019, 4:09 PM IST

అమరావతి:  ఈ ఏడాది ఏప్రిల్ 1 కంటే ముందు మంజూరై ఇంకా ప్రారంభించని పనులను రద్దు చేయాలని  ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం అన్ని శాఖలను ఆదేశించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సీఎస్ ఈ నిర్ణయం తీసుకొన్నారు.

25 శాతం కూడ పనులు పూర్తి కాని ప్రాజెక్టుల పనుల విషయంలో విలువను తాజాగా నిర్ధారించి తదుపరి చెల్లింపులు చేయకూడదని కూడ సీఎస్ ఆదేశించారు.పేదల సంక్షేమంతో పాటు అవినీతి రహిత పాలనను అందించడమే లక్ష్యంగా కొత్త ప్రభుత్వం పాలనను అందించే లక్ష్యంగా ఉన్నందున ఆయా శాఖల కార్యదర్శులంతా నిబంధనల ప్రకారంగా వ్యవహరించాలని సీఎస్ కోరారు.

ప్రభుత్వం మంజూరు చేసిన పనుల్లో నిధుల వ్యయం, బిల్లుల మంజూరుపై స్పష్టత నిస్తూ ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం మోమో జారీ చేశారు. ఎప్ఆర్‌బీఎం పరిమితులు పట్టించుకోకుండా మంజూరు చేసిన ఇంజనీరింగ్ పనులు రాష్ట్ర ఖజానాపై భారం పడేలా చేశాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రాధాన్యతలను పట్టించుకోకుండా చేపట్టిన కొన్ని ప్రాజెక్టుల పనులను సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. దిగజారుతున్న ఆర్ధిక వనరులు ఆర్ధికంగా అనాలోచిత నిర్ణయాలను ఉదహరిస్తున్నట్టుగా ఆయన అభిప్రాయపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios