ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఉల్లి ధరలపై టీడీపీ నిరసన
అసెంబ్లీ ఫైర్ స్టేషన్ దగ్గర టీడీపీ ఆందోళన చేపట్టింది. పెరిగిన ఉల్లి ధరలు సామాన్యులపై మోయలేని భారంగా మారాయని చంద్రబాబు అన్నారు. ఆరునెలల పాలనలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీ సమావేశాల్లో గళమెత్తాలని టీడీపీ నిర్ణయించింది.
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాగా... ఈ సమావేశాల్లో టీడీపీ నేతలు ముందుగానే నిరసన చేపట్టారు.పెరిగిన ఉల్లి ధరలకు నిరసనగా టీడీపీ ఆందోళనకు దిగింది. ఉల్లి దండలు మెడలో వేసుకుని ఆ పార్టీ నేతలు నిరసన తెలిపారు.
అసెంబ్లీ ఫైర్ స్టేషన్ దగ్గర టీడీపీ ఆందోళన చేపట్టింది. పెరిగిన ఉల్లి ధరలు సామాన్యులపై మోయలేని భారంగా మారాయని చంద్రబాబు అన్నారు. ఆరునెలల పాలనలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీ సమావేశాల్లో గళమెత్తాలని టీడీపీ నిర్ణయించింది.
అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరేముందు చంద్రబాబు వెంటకపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఉల్లి కేజీ రూ. 200 అమ్ముతుందంటే ఎంత దుర్మార్గమో ఆలోచించాలని చంద్రబాబు అన్నారు. మరోవైపు నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ఇంకోవైపు రైతులకు గిట్టుబాటు ధర రావడంలోని చంద్రబాబు విమర్శించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... రాష్ట్రంలో ఉల్లిధరలు బంగారంతో సమానంగా ఉన్నాయన్నారు. ఉల్లి ధరలను ప్రభుత్వం నియంత్రించలేకపోతోందన్నారు. టీడీపీ హయాంలో నిత్యవసర ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. సబ్సీడీపై తక్కువ ధరలతో ఉల్లి అందించామన్నారు. ఉల్లి ధరలు దిగివచ్చే వరకు ఆందోళన చేపడతామన్నారు.
ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ప్రధాన ద్వారం తెదేపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రకార్డులతో అనుమతి లేదని చంద్రబాబును పోలీసులు గేటు వద్దే ఆపేశారు. చంద్రబాబుతో పాటు ఇతర నేతలను కూడా గేటు వద్దే ఆపేశారు. కాగా..పోలీసులకు నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.