అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1316  కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 58వేల 711 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో 11 మంది కరోనా మరణించారు. కరోనాతో చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఇద్దరి చొప్పున చనిపోయారు. తూర్పుగోదావరి, అనంతపురం, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్టణం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరి చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 6,910కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 94లక్షల 08వేల 868మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.  గత 24 గంటల్లో 75,165 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.వీరిలో 1316మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో1,821 మంది కరోనా నుండి కోలుకొన్నారు.

ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 35వేల 801 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 16వేల యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 60,చిత్తూరులో 198,తూర్పుగోదావరిలో 183, గుంటూరులో 206, కడపలో 058, కృష్ణాలో 196, కర్నూల్ లో 014, నెల్లూరులో 040, ప్రకాశంలో 043, శ్రీకాకుళంలో 028, విశాఖపట్టణంలో 045, విజయనగరంలో 018,పశ్చిమగోదావరిలో 227కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -66,344, మరణాలు 584
చిత్తూరు  -82,641,మరణాలు 816
తూర్పుగోదావరి -1,21,123, మరణాలు 629
గుంటూరు  -71,632, మరణాలు 641
కడప  -53,851,మరణాలు 446
కృష్ణా  -43,923, మరణాలు 617
కర్నూల్  -60,012, మరణాలు 483
నెల్లూరు -61,008, మరణాలు 492
ప్రకాశం -61,085, మరణాలు 576
శ్రీకాకుళం -45,160, మరణాలు 346
విశాఖపట్టణం  -57,493, మరణాలు 530
విజయనగరం  -40,376,మరణాలు 233
పశ్చిమగోదావరి -91,168, మరణాలు 517