కృష్ణా జిల్లా కంచికచర్లలో దారుణం జరిగింది. ఉద్యోగం రాలేదని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. కంచికచర్ల హనుమాన్ పేట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. యువతిని మద్దిర మండలం జిలుగుమాడు గ్రామానికి  చెందిన దోర్నాల అనూష గా పోలీసులు గుర్తించారు.

అనూష చాలాసార్లు బ్యాంకు ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించింది. దీనికోసం చాలా సార్లు రిటెన్ టెస్టులు రాసింది. అయితే ఫలితం లేకపోయింది. దీంతో అనూష తీవ్ర మనస్తాపానికి గురైంది. 

కంచికచర్ల హనుమాన్ పేట బంధువుల ఇంట్లో అనూష ఉరివేసుకొని మృతి చెందింది. విషయం తెలియగానే మృతదేహాన్ని స్వాధీనం చేసుకొన్న పోలీసులు మార్చురీకి తరలించారు. 

అనూష తండ్రి భద్రాచలంలో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అయితే మహిళా బలవన్మరణానికి వేరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.