ఆంధ్రప్రదేశ్‌లో ఏఆర్ కానిస్టేబుల్ పనిచేస్తున్న ప్రశాంతి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది. వివరాలు.. ప్రశాంతి అనే మహిళ ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆమె తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కుటుంబ కలహాలే ప్రశాంతి ఆత్మహత్య చేసుకోవడానికి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆత్మహత్య‌కు గల కారణాలపై విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also read: ప్రేమోన్మాది దాడిలో మరణించిన యువతి కుటుంబాన్ని ఆదుకున్న సీఎం జగన్‌.. రూ. 10 లక్షల ఆర్థిక సాయం

కృష్ణా నదిలో దూకి వార్డు వాలంటీర్ ఆత్మహత్య..
ఇంట్లో నుంచి కనిపించకుండా పోయిన ఓ వార్డు వాలంటీర్ కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటుచేసుకుంది. మహానాడుకు చెందిన బొరిగర్ల వెంకట రవికుమార్‌ వాలంటీరుగా పనిచేస్తున్నారు. అతడు కనిపించకుండా పోవడంతో అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే బుధవారం కృష్ణానదిలో రవికుమార్ శవంగా తేలాడు. అతని జేబులో సూసైడ్ నోట్ లభ్యమైనట్టుగా తెలుస్తోంది. 

‘నా చావుకు కారణం ఈ వాలంటీరు వ్యవస్థ. బాగానే పనిచేసినా తీవ్రమైన ఒత్తిడికి గురిచేసేవారు. సచివాలయ సిబ్బందికి పనిలో సహాయం చేసినా ఏమాత్రం కృతజ్ఞత చూపరు. ఒత్తిడి వల్ల మానసికంగా కృంగిపోయాను. మొన్నటివరకు అడ్మిన్‌ పదేపదే రిజైన్‌ చేయాలని ఇబ్బంది పెట్టేవారు’ అని ఆ లేఖలో రాసి ఉంది. పోలీసులు ఆ లేఖను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. లేఖలో చేతిరాత రవికుమార్‌దేనా..? కాదా..? అనేది పరిశీలించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. లేఖలో రవికుమార్ సంతకం లేదని చెప్పారు.