Asianet News TeluguAsianet News Telugu

ఆరు నెలల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు: జగన్ సర్కార్ నిర్ణయం

వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని ఏపీ ప్రభుత్వం నిర్నయం తీసుకొంది. శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

Andhra Pradesh To Introduce Agriculture Electricity Cash Transfer Scheme
Author
Guntur, First Published May 9, 2022, 8:35 PM IST


అమరావతి:Agriculture విద్యుత్ కనెక్షన్లకు  మీటర్లు బిగించాలని  Andhra Pradesh రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో  రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని  రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 

రాష్ట్రంలోని 18 లక్షల వ్యవసాయ Electricity కనెక్లలకు సంబంధించి ఆరు నెలల్లో విద్యుత్ Meterను బిగించాలని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి Peddireddy Ramachandra Reddy అధికారులను ఆదేశించారు.  రైతులు వినియోగించుకున్న విద్యుత్ కు చెల్లించాల్సిన సొమ్మును ప్రభుత్వమే భరిస్తూ ఆ సబ్సిడీ మొత్తాలను రైతుల ఖాతాలకే నేరుగా డిబిటి కింద జమ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని  మంత్రి  అధికారులను కోరారు.

సోమవారం నాడు ఏపీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
 విద్యుత్  మీటర్ల ఏర్పాటు వల్ల వ్యవసాయానికి నికరంగా రైతులు ఎంత మేరకు విద్యుత్ ను వినియోగించుకుంటున్నారో ఖచ్చితమైన వివరాలు తెలుస్తాయని అన్నారు.

 2021-22 ఆర్థిక సంవత్సరంలో Srikakulam జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ గా 28వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ లకు మీటర్లను ఏర్పాటు చేసినట్టుగా మంత్రి చెప్పారు.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇదే జిల్లాలో 26వేల వ్యవసాయ కనెక్షన్ లకు గానూ 101.51 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను వినియోగించుకున్నారని Discomsలు లెక్కలు వేశాయని తెలిపారు. దాని ప్రకారం విద్యుత్ సబ్సిడీని ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. అయితే ఇదే జిల్లాల్లో విద్యుత్ మీటర్లను భిగించిన తరువాత 2021-22 ఆర్థిక సంవత్సరానికి 28వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ లకు గానూ 67.76 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను వినియోగించినట్లు నిర్థిష్టంగా గుర్తించామని మంత్రి వివరించారు.

 మీటర్లు భిగించడం వల్ల నికరంగా ఎంత విద్యుత్ ను వ్యవసాయం కోసం వినియోగిస్తున్నారో తేలిందన్నారు., గత ఏడాదితో పోలిస్తే రెండు వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ లు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా 33.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ తక్కువగానే వినియోగించారన్నారు.. ఈ మేరకు మాత్రమే ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ సబ్సిడీని డిస్కం లకు చెల్లించిందన్నారు. వినియోగించకపోయినా కూడా సరైన లెక్కలు తేలకపోవడం వల్ల ఇప్పటి వరకు వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ పేరుతో చేస్తున్న అదనపు చెల్లింపులకు చెక్ పెట్టడం జరిగిందని మంత్రి  వివరించారు. 

 ఉచిత విద్యుత్ ను మరింత నాణ్యత, మెరుగైన సరఫరాతో రైతులకు చేరువ చేయాలని మంత్రి  ఆదేశించారు. వ్యవసాయ కనెక్షన్ లకు మీటర్లు బిగించడంపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయన మంత్రి మండిపడ్డారు.రైతులు వ్యవసాయానికి వినియోగించిన ప్రతి యూనిట్ కు ప్రభుత్వమే సబ్సిడీగా చెల్లింపులు చేస్తుందని స్పష్టం చేశారు. 

అందుకోసం రైతుల పేరుమీద రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకుల్లో ఖాతాలను ప్రారంభించాలని, వారి వ్యవసాయ కనెక్షన్ కోసం వినియోగించిన విద్యుత్ కు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం నేరుగా డిబిటి విధానంలో వారి ఖాతాల్లోనే జమ చేస్తుందని  మంత్రి చెప్పారు.  ఈ సొమ్మును రైతులు డిస్కం లకు చెల్లిస్తారని, దీనివల్ల డిస్కం ల జవాబుదారీతనం పెరుగుతుందని అన్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయని, వాటికి సంబంధించిన బ్యాంకు ఖాతాలను త్వరతగతిన ప్రారంభించాలన్నారు.అలాగే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం నిర్ధేశించిన గడువు నాటికి రాష్ట్రం అంతా కూడా కొత్త మీటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. 

   జగనన్న హౌసింగ్ కాలనీలు పూర్తయ్యి, గృహాల్లో లబ్ధిదారులు నివాసాలను ప్రారంభించే నేపథ్యంలో ఆ కాలనీల్లో విద్యుద్దీకరణ పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందుకు నిధుల కొరత లేకుండా ఏపి పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా డిస్కం లకు రుణాలను సమకూరుస్తామని హామీ ఇచ్చారు. అలాగే వైయస్ఆర్ జలకళ కింద రైతులకు విద్యుత్ సదుపాయం కల్పించడం, విద్యుత్ ఉపకరణాలను అందించే కార్యక్రమాన్ని  కూడా వేగవంతం చేయాలని సూచించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios