24 గంటల్లో 88 మంది కరోనాతో మృతి: ఏపీలో 3 లక్షలు దాటిన కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 9652 కేసులు రికార్డయ్యాయి. అంతేకాదు కరోనాతో 88 మంది మరణించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 9652 కేసులు రికార్డయ్యాయి. అంతేకాదు కరోనాతో 88 మంది మరణించారు.
గత 24 గంటల్లో అనంతపురంలో 445, చిత్తూరులో 990, తూర్పుగోదావరిలో1396, గుంటూరులో895, కడపలో 755, కృష్ణాలో281, కర్నూల్ లో830, నెల్లూరులో 830, ప్రకాశంలో 725, శ్రీకాకుళంలో 405, విశాఖపట్టణంలో 928, విజయనగరంలో513, పశ్చిమగోదావరిలో805 కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో చిత్తూరులో 14, ప్రకాశంలో 11 మంది, అనంతపురం,, గుంటూరు, కర్నూల్ జిల్లాల్లో 9 మంది చొప్పున, నెల్లూరులో ఏడుగురు, పశ్చిమగోదావరిలో ఆరుగురు, శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు చొప్పున కరోనాతో మరణించారు.తూర్పుగోదావరిలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, కడపలో ఒక్కరు మరణించినట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రంలో 85 వేల 130 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా సోకి 2 లక్షల 18 వేల 311 మంది కోలుకొన్నారు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటివరకు 2,820 మంది మరణించారని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు
అనంతపురం- 30,507, మరణాలు 238
చిత్తూరు - 24,907, మరణాలు 257
తూర్పుగోదావరి - 42,600, మరణాలు 290
గుంటూరు - 27,610, మరణాలు 306
కడప - 18,086, మరణాలు 125
కృష్ణా - 12,760, మరణాలు 232
కర్నూల్ - 34,782, మరణాలు 306
నెల్లూరు- 18,239, మరణాలు 155
ప్రకాశం - 12,948, మరణాలు 185
శ్రీకాకుళం - 15,663, మరణాలు 176
విశాఖపట్టణం- 26,255, మరణాలు 216
విజయనగరం - 26,255, మరణాలు 126
పశ్చిమగోదావరి - 25,111, మరణాలు 208