తూర్పు గోదావరిలో అదే జోరు: ఏపీలో 3,25,396కి చేరిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 9,393 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3 లక్షల 25 వేల 396కి చేరుకొన్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 9,393 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3 లక్షల 25 వేల 396కి చేరుకొన్నాయి.
also read:సెరో సర్వే: ఢిల్లీ వాసుల్లో 28 శాతానికి పెరిగిన యాంటీబాడీస్
గత 24 గంటల్లో కరోనాతో రాష్ట్రంలో 95 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనా సోకి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3,001కి చేరింది.గత 24 గంటల్లో చిత్తూరులో 16, ప్రకాశంలో 11, నెల్లూరులో 9మంది, అనంతపురం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో 8 మంది చొప్పున మరణించారు. కడపలో ఏడుగురు, గుంటూరు, కర్నూల్, విశాఖపట్టణంలలో ఆరుగురి చొప్పున, శ్రీకాకుళంలో ఐదుగురు, విజయనగరంలో ముగ్గురు, కృష్ణాలో ఇద్దరు మరణించారు.
రాష్ట్రంలో కరోనా సోకి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3,001కి చేరింది.రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 87,177గా ఉన్నాయి. కరోనా సోకిన రికవరీ అయిన వారి సంఖ్య 2 లక్షల 35 వేల 216గా ఉందని ఏపీ ప్రభుత్వం గురువారం నాడు ప్రకటించింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 87,177గా ఉన్నాయి. కరోనా సోకిన రికవరీ అయిన వారి సంఖ్య 2 లక్షల 35 వేల 216గా ఉందని ఏపీ ప్రభుత్వం గురువారం నాడు ప్రకటించింది.
గత 24 గంటల్లో అనంతపురంలో 973, చిత్తూరులో 836, తూర్పు గోదావరిలో 1357, గుంటూరులో 443, కడపలో 434, కృష్ణాలో 195, కర్నూల్ లో 805, నెల్లూరులో 588, ప్రకాశంలో 635, శ్రీకాకుళంలో 762, విశాఖపట్టణంలో 985, విజయనగరంలో 385, పశ్చిమగోదావరిలో 995 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసులు, మరణాలు
అనంతపురం -32,603, మరణాలు 254
చిత్తూరు - 26,573, మరణాలు 288
తూర్పు గోదావరి -45,356, మరణాలు 303
గుంటూరు -28,808, మరణాలు 319
కడప -19,193, మరణాలు 136
కృష్ణా -13,236, మరణాలు 237
కర్నూల్ -36,381, మరణాలు 314
నెల్లూరు- 19,672, మరణాలు 179
ప్రకాశం -14,168, మరణాలు 202
విశాఖపట్టణం -28,075, మరణాలు 227
శ్రీకాకుళం -16,990, మరణాలు 187
విజయనగరం -14,421, మరణాలు134
పశ్చిమగోదావరి -27,025, మరణాలు 221