అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 9,881 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 10 లక్షల43వేల 441కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 51 మంది మరణించారు. కరోనాతో చిత్తూరు, నెల్లూరు,కర్నూల్ జిల్లాల్లో ఆరుగురి చొప్పున చనిపోయారు.విజయనగరంలో ఐదుగురు, అనంతపురం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురి చొప్పున మృతి చెందారు. గుంటూరు, కడప, కృష్ణా, శ్రీకాకుళం, విశాఖపట్టణం జిల్లాల్లో ముగ్గురి చొప్పున చనిపోయారు. ప్రకాశం జిల్లాలో ఇద్దరు మృతి చెందారు.
దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,736 కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,60,68,648 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 74,041 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో9,881 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో 4,431 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 9 లక్షల 40వేల 574 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 95,131 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 395, చిత్తూరులో 860,తూర్పుగోదావరిలో 1302,గుంటూరులో 1048, కడపలో 483,కృష్ణాలో 310, కర్నూల్ లో 629, నెల్లూరులో 1592,ప్రకాశంలో 522, శ్రీకాకుళంలో 906, విశాఖపట్టణంలో 1030, విజయనగరంలో 616,పశ్చిమగోదావరిలో188కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -77,279 మరణాలు 636
చిత్తూరు  -1,10,832,మరణాలు 954
తూర్పుగోదావరి -1,36,570, మరణాలు 665
గుంటూరు  -96,930, మరణాలు 710
కడప  -60,906, మరణాలు 485
కృష్ణా  -59,129,మరణాలు 749
కర్నూల్  -73,429,మరణాలు 534
నెల్లూరు -75,889,మరణాలు 585
ప్రకాశం -68,916,మరణాలు 612
శ్రీకాకుళం -62,084,మరణాలు 379
విశాఖపట్టణం  -74,767,మరణాలు 617
విజయనగరం  -47,361, మరణాలు 255
పశ్చిమగోదావరి -96,454, మరణాలు 545