అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 813 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 13,098కి చేరుకొన్నాయి.  24 గంటల్లో కరోనాతో 12 మంది మరణించారు.

24 గంటల్లో 25,778 మంది శాంపిల్స్ పరీక్షిస్తే 813 మందికి కరోనా సోకినట్టుగా తేలింది. 24 గంటల వ్యవధిలో 401 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఒక్క రోజులో మరణించిన 12 మందిలో  కర్నూల్ జిల్లాలో అత్యధికంగా ఆరుగురు మరణించారు. కృష్ణ జిల్లాలో ఐదుగురు, పశ్చిమ గోదావరిలో ఒక్కరు మరణించారు.

 

24 గంటల వ్యవధిలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చినవారిలో 50 మందికి, ఇతర దేశాల నుండి వచ్చినవారికి 8 మందికి కరోనా సోకింది.  ఇప్పటివరకు విదేశాల నుండి వచ్చినవారిలో 385 మందికి కరోనా సోకింది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారిలో 1865 మందికి కరోనా సోకినట్టుగా ఏపీ ప్రభుత్వం తెలిపింది.

కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 1787 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో కృష్ణా జిల్లా నిలిచింది. రాష్ట్రంలో కరోనా నుండి కోలుకొని 4,685 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 5994 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో రాష్ట్రంలో 169 మంది మరణించినట్టుగా ఏపీ ప్రభుత్వం తెలిపింది.