అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 6,751 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 7,00,235కి చేరుకొన్నాయి.


గత 24 గంటల్లో 41 మంది కరోనాతో మరణించారు.చిత్తూరులో ఏడుగురు, ప్రకాశం, విశాఖపట్టణంలలో ఐదుగురి చొప్పున మరణించారు.అనంతపురం,తూర్పుగోదావరిలో నలుగురి చొప్పున, గుంటూరు,కడపలలో ముగ్గురి చొప్పున చనిపోయారు. పశ్చిమగోదావరిలో ఇద్దరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కరు మరణించారు. ఏపీ రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 5,869 మంది మరణించారు.
 
ఏపీ రాష్ట్రంలో గత 24 గంటల్లో 71 వేల 577 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 6751 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఏపీలో ఇప్పటివరకు 6 లక్షల 36 వేల 508 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 57,858 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 333,చిత్తూరులో 888, తూర్పుగోదావరిలో 986, గుంటూరులో 594, కడపలో 400, కృష్ణాలో 424, కర్నూల్ లో 265, నెల్లూరులో 472,ప్రకాశంలో 783, శ్రీకాకుళంలో 301, విశాఖపట్టణంలో 277, విజయనగరంలో 275,పశ్చిమగోదావరిలో 753కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -57,708, మరణాలు 491
చిత్తూరు  -62,746మరణాలు 662
తూర్పుగోదావరి -98,160 మరణాలు 528
గుంటూరు  -55,284 మరణాలు 534
కడప  -44,218 మరణాలు 377
కృష్ణా  -27,852 మరణాలు 446
కర్నూల్  -56,423 మరణాలు 464
నెల్లూరు -52,807 మరణాలు 447
ప్రకాశం -49,032  మరణాలు 489
శ్రీకాకుళం -39,919 మరణాలు 321
విశాఖపట్టణం  -50,305 మరణాలు 437
విజయనగరం  -35,426 మరణాలు 218
పశ్చిమగోదావరి -67,460 మరణాలు 455