Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో తగ్గుతున్న కరోనా: మొత్తం కేసులు 7,55,7127కి చేరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 5,210 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 7 లక్షల 55 వేల 727కి చేరుకొన్నాయి. 
గత 24 గంటల్లో 30 మంది కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6,224కి చేరుకొన్నాయి.
 

Andhra pradesh reports 5,210 new corona cases, total rises to 7,55, 727 lns
Author
Amaravathi, First Published Oct 11, 2020, 5:45 PM IST

అమరావతి:

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 5,210 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 7 లక్షల 55 వేల 727కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో 30 మంది కరోనాతో మరణించారు. గత 24 గంటల్లో కరోనాతో ప్రకాశం జిల్లాలో ఎనిమిది మంది, చిత్తూరులో నలుగురు, తూర్పుగోదావరి, గుంంటూరు, కడప, విశాఖపట్టణం జిల్లాల్లో ముగ్గురి చొప్పున మరణించారు. అనంతపురం, కృష్ణా జిల్లాల్లో ఇద్దరి  చొప్పున, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కరు మరణించారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6,224కి చేరుకొన్నాయి.

రాష్ట్రంలో ఇప్పటివరకు 65 లక్షల 69 వేల 616 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 75,517 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 5,210 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

ఏపీ రాష్ట్రంలో గత 24 గంటల్లో 56 వేల 145మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 4256 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఏపీలో ఇప్పటివరకు 7 లక్షల 03 వేల 208 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 46,295యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 311,చిత్తూరులో713, తూర్పుగోదావరిలో 701, గుంటూరులో 431, కడపలో 418, కృష్ణాలో 462, కర్నూల్ లో 175, నెల్లూరులో 288,ప్రకాశంలో 362, శ్రీకాకుళంలో 212, విశాఖపట్టణంలో 190 విజయనగరంలో 161,పశ్చిమగోదావరిలో 786కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -60,947, మరణాలు 524
చిత్తూరు  -70,322 మరణాలు 705
తూర్పుగోదావరి -1,06,043 మరణాలు 568
గుంటూరు  -59,842 మరణాలు 560
కడప  -48,019 మరణాలు 396
కృష్ణా  -31,950 మరణాలు 493
కర్నూల్  -58,105 మరణాలు 477
నెల్లూరు -56,678 మరణాలు 471
ప్రకాశం -54,388 మరణాలు 531
శ్రీకాకుళం -41,698 మరణాలు 330
విశాఖపట్టణం  -52,516 మరణాలు 473
విజయనగరం  -37,324 మరణాలు 224
పశ్చిమగోదావరి -75,000 మరణాలు 472
 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios