ఏపీలో కరోనా కల్లోలం: 24 గంటల్లో 5 వేలు దాటిన కేసులు, 14 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో5,096 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 9 లక్షల 42వేల 135 కి చేరుకొన్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో5,096 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 9 లక్షల 42వేల 135 కి చేరుకొన్నాయి. గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో 14 మంది మరణించారు. కరోనాతో చిత్తూరులో ఐదుగురు, అనంతపురం, కర్నూల్, విశాఖపట్టణంలలో ఇద్దరు చొప్పున చనిపోయారు. కడప, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరిచొప్పున మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,353 కి చేరుకొంది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 1,55,70,201 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 35,741 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో5,086మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో 1,745 మంది కరోనా నుండి కోలుకొన్నారు. ఏపీలో ఇప్పటివరకు 9 లక్షల 03 వేల 072 మంది కరోనా నుండి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇంకా 31,710 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
గత 24 గంటల్లో అనంతపురంలో 334, చిత్తూరులో 835,తూర్పుగోదావరిలో 450,గుంటూరులో 611, కడపలో 096,కృష్ణాలో 396, కర్నూల్ లో 626, నెల్లూరులో 223,ప్రకాశంలో 236, శ్రీకాకుళంలో 568, విశాఖపట్టణంలో 432, విజయనగరంలో 248,పశ్చిమగోదావరిలో 031కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు
అనంతపురం -70,415 మరణాలు 613
చిత్తూరు -97008,మరణాలు 904
తూర్పుగోదావరి -1,27,556, మరణాలు 638
గుంటూరు -84,128, మరణాలు 689
కడప -57,667, మరణాలు 466
కృష్ణా -53,927,మరణాలు 696
కర్నూల్ -64,339, మరణాలు 505
నెల్లూరు -65,802,మరణాలు 529
ప్రకాశం -64, 592,మరణాలు 590
శ్రీకాకుళం -49,680,మరణాలు 351
విశాఖపట్టణం -66,425,మరణాలు 592
విజయనగరం -42,585, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,893, మరణాలు 542