చిత్తూరులో కరోనా జోరు: ఏపీలో మొత్తం కేసులు 20,64,287కి చేరిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో33,944 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 415 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కరోనా కేసులు 20,64,287కి చేరుకొన్నాయి.
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో33,944 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 415 మందికి కరోనా నిర్ధారణ అయింది. Andhra pradeshలో కరోనా కేసులు 20,64,287కి చేరుకొన్నాయి.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి ఆరుగురు మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,356 కి చేరింది.
also read:తూ.గోలో అత్యధికం, ప.గోలో అత్యల్పం: ఏపీలో మొత్తం కరోనా కేసులు 20,63,872కి చేరిక
గడిచిన 24 గంటల్లో 584 మంది Corona నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 20లక్షల 45వేల 276 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 4655యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,93,25,840 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
గత 24 గంటల్లో అనంతపురంలో006,చిత్తూరులో 093, తూర్పుగోదావరిలో025,గుంటూరులో050,కడపలో 006, కృష్ణాలో076, కర్నూల్ లో005, నెల్లూరులో020, ప్రకాశంలో 018,విశాఖపట్టణంలో 036,శ్రీకాకుళంలో024, విజయనగరంలో 003,పశ్చిమగోదావరిలో 053కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో కరోనాతో ఆరుగురు మృతి చెందారు. కృష్ణా, గుంటూరు,పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరి చొప్పున కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,356కి చేరుకొంది.
ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు
అనంతపురం-1,57,811, మరణాలు 1093
చిత్తూరు-2,46,552, మరణాలు1942
తూర్పుగోదావరి-2,93,326, మరణాలు 1290
గుంటూరు -1,77,877,మరణాలు 1235
కడప -1,15,560, మరణాలు 644
కృష్ణా -1,19,070,మరణాలు 1425
కర్నూల్ - 1,24,123,మరణాలు 853
నెల్లూరు -1,46,269,మరణాలు 1051
ప్రకాశం -1,38,416, మరణాలు 1123
శ్రీకాకుళం-1,23,014, మరణాలు 786
విశాఖపట్టణం -1,57,588, మరణాలు 1127
విజయనగరం -82,917, మరణాలు 671
పశ్చిమగోదావరి-1,78,899, మరణాలు 1116