అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 2901 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 11వేల 825 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో కరోనాతో  19 మంది మరణించారు. కడపలో నలుగురు, చిత్తూరు, కృష్ణాలో ముగ్గురి చొప్పున చనిపోయారు. పశ్చిమగోదావరి, ప్రకాశంలలో ఇద్దరి చొప్పున మృతి చెందారు. అనంతపురం, గుంటూరు, కర్నూల్, విశాఖపట్టణం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కరి చొప్పున చనిపోయారు. దీంతోరాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6,625కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 76లక్షల 96వేల 653 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 74,757మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 2901 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

ఏపీలో ఇప్పటివరకు 7 లక్షల 77 వేల 900 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  గత 24 గంటల్లో కరోనా నుండి 4,352 మంది కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇంకా 27,300 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 153,చిత్తూరులో 272 తూర్పుగోదావరిలో 464, గుంటూరులో 385, కడపలో 127 కృష్ణాలో 411, కర్నూల్ లో 055 నెల్లూరులో 075,ప్రకాశంలో 153, శ్రీకాకుళంలో 073, విశాఖపట్టణంలో 106, విజయనగరంలో 071,పశ్చిమగోదావరిలో 555కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -63,872, మరణాలు 552
చిత్తూరు  -77,121,మరణాలు 772
తూర్పుగోదావరి -1,14,137 మరణాలు 605
గుంటూరు  -65,731 మరణాలు 610
కడప  -51,379 మరణాలు 435
కృష్ణా  -37,633 మరణాలు 554
కర్నూల్  -59,341 మరణాలు 482
నెల్లూరు -59,158 మరణాలు 485
ప్రకాశం -58,816 మరణాలు 569
శ్రీకాకుళం -43,624 మరణాలు 339
విశాఖపట్టణం  -55,315 మరణాలు 503
విజయనగరం  -39,024 మరణాలు 228
పశ్చిమగోదావరి -83,779మరణాలు 491