అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 2886 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 20 వేల 565 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో 17 మంది కరోనా మరణించారు.కరోనాతో కృష్ణాలో ముగ్గురు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కడప, విశాఖపట్టణంలలో ఇద్దరి చొప్పున చనిపోయారు. తూర్పుగోదావరి, ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరి  చొప్పున మరణించారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6,676 కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 79లక్షల 46వేల 860 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 84,401 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 2886 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

ఏపీలో ఇప్పటివరకు 7 లక్షల 88 వేల 375 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 25,514 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 151,చిత్తూరులో 296 తూర్పుగోదావరిలో 405, గుంటూరులో 385, కడపలో148 కృష్ణాలో 448, కర్నూల్ లో 036 నెల్లూరులో 080, ప్రకాశంలో 145, శ్రీకాకుళంలో 077, విశాఖపట్టణంలో 152, విజయనగరంలో 069,పశ్చిమగోదావరిలో 493కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -64,436, మరణాలు 559
చిత్తూరు  -77,991,మరణాలు 778
తూర్పుగోదావరి -1,15,373 మరణాలు 610
గుంటూరు  -66,896 మరణాలు 616
కడప  -51,911 మరణాలు 439
కృష్ణా  -38,899 మరణాలు 563
కర్నూల్  -59,434 మరణాలు 482
నెల్లూరు -59,410 మరణాలు 486
ప్రకాశం -59,267 మరణాలు 571
శ్రీకాకుళం -43,865 మరణాలు 339
విశాఖపట్టణం  -55,700 మరణాలు 507
విజయనగరం  -39,230 మరణాలు 230
పశ్చిమగోదావరి -85,258 మరణాలు 496