అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 2849  కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 30 వేల 731కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో 15 మంది కరోనా మరణించారు.కరోనాతో అనంతపురం, గుంటూరులలో ముగ్గురు చొప్పున మరణించారు. చిత్తూరు, కృష్ణాలో ఇద్దరి చొప్పున చనిపోయారు. తూర్పుగోదావరి, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, పశ్చిమగోదావరిలలో ఒక్కరి చొప్పున మృతి చెందారు.రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6,734 కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 82లక్షల 66వేల 800 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 84,534 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 2849 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 02 వేల 325 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 21,672 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 142,చిత్తూరులో 436 తూర్పుగోదావరిలో 394, గుంటూరులో 277, కడపలో169 కృష్ణాలో 421, కర్నూల్ లో 035 నెల్లూరులో 093, ప్రకాశంలో 185, శ్రీకాకుళంలో 088, విశాఖపట్టణంలో 145, విజయనగరంలో 078,పశ్చిమగోదావరిలో 386 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -64,977, మరణాలు 568
చిత్తూరు  -79,322,మరణాలు 787
తూర్పుగోదావరి -1,16,783 మరణాలు 614
గుంటూరు  -68,063 మరణాలు 625
కడప  -52,515 మరణాలు 440
కృష్ణా  -40,141 మరణాలు 575
కర్నూల్  -59,565 మరణాలు 482
నెల్లూరు -59,778 మరణాలు 487
ప్రకాశం -60,019 మరణాలు 573
శ్రీకాకుళం -44,183 మరణాలు 342
విశాఖపట్టణం  -56,148 మరణాలు 510
విజయనగరం  -39,507 మరణాలు 230
పశ్చిమగోదావరి -86,835 మరణాలు 501