Asianet News TeluguAsianet News Telugu

24 గంటల్లో గుంటూరులో అత్యధికం, అత్యల్పం కర్నూల్‌లో: ఏపీలో 8,42,967కి చేరిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 2237కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 42వేల967కి చేరుకొన్నాయి.

Andhra pradesh reports 2237 new corona cases, total rises to 8,42,967 lns
Author
Amaravathi, First Published Nov 8, 2020, 6:24 PM IST


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 2237కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 42వేల967కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో 12మంది కరోనా మరణించారు.కరోనాతో కృష్ణాజిల్లాలో ముగ్గురు, చిత్తూరు, విశాఖపట్టణం జిల్లాల్లో ఇద్దరి చొప్పున మరణించారు.తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరిలలో ఒక్కరి చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6,791 కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 86లక్షల 63వేల 975 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 76,663 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 2237మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 14 వేల 773 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 21,403 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 109,చిత్తూరులో 329,తూర్పుగోదావరిలో 188, గుంటూరులో 364, కడపలో084, కృష్ణాలో 277, కర్నూల్ లో 24 నెల్లూరులో 88, ప్రకాశంలో 83, శ్రీకాకుళంలో 117, విశాఖపట్టణంలో 108, విజయనగరంలో 87,పశ్చిమగోదావరిలో 379 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -65,578, మరణాలు 573
చిత్తూరు  -80,766మరణాలు 796
తూర్పుగోదావరి -1,18,589 మరణాలు 619
గుంటూరు  -69,596, మరణాలు 631
కడప  -53114,మరణాలు 442
కృష్ణా  -41,804 మరణాలు 589
కర్నూల్  -59,722 మరణాలు 482
నెల్లూరు -60,364, మరణాలు 488
ప్రకాశం -60,488 మరణాలు 574
శ్రీకాకుళం -44,681 మరణాలు 344
విశాఖపట్టణం  -56,775 మరణాలు 517
విజయనగరం  -39,919 మరణాలు 230
పశ్చిమగోదావరి -88,676 మరణాలు 506

 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios