ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో218 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 92వేల 269 కి చేరుకొన్నాయి. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో218 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 92వేల 269 కి చేరుకొన్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఒక్కరు కూడా మరణించలేదు.. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,186 కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,46,42,664 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 31,165 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో218 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

గత 24 గంటల్లో 117 మంది కరోనా నుండి కోలుకొన్నారు. ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 83వేల 759 మంది కరోనా నుండి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇంకా 1795 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

also read:కరోనా కలకలం:భైంసా స్కూల్లో 25 మంది విద్యార్ధులకు కోవిడ్

గత 24 గంటల్లో అనంతపురంలో 013, చిత్తూరులో 063,తూర్పుగోదావరిలో 023,గుంటూరులో 024, కడపలో 021,కృష్ణాలో 021, కర్నూల్ లో 018, నెల్లూరులో 005,ప్రకాశంలో 002, శ్రీకాకుళంలో 006, విశాఖపట్టణంలో 011, విజయనగరంలో 006,పశ్చిమగోదావరిలో 003 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,919, మరణాలు 601
చిత్తూరు -88,244,మరణాలు 857
తూర్పుగోదావరి -1,24,757, మరణాలు 636
గుంటూరు -76,066, మరణాలు 673
కడప -55,514, మరణాలు 463
కృష్ణా -49,227,మరణాలు 682
కర్నూల్ -61,029, మరణాలు 490
నెల్లూరు -62,556, మరణాలు 509
ప్రకాశం -62,269, మరణాలు 580
శ్రీకాకుళం -46,332,మరణాలు 347
విశాఖపట్టణం -60,336, మరణాలు 568
విజయనగరం -41,193, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,393, మరణాలు 542