ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 212 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 81వేల 273 కి చేరుకొన్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 212 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 81వేల 273 కి చేరుకొన్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో నలుగురు మరణించారు. పశ్చిమగోదావరిలో ఇద్దరు కరోనాతో మరణించారు. గుంటూరు, విశాఖపట్టణం జిల్లాల్లో ఒక్కరి చొప్పున చనిపోయారు.దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,098కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,16,57,884 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 37,381మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 0212 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 70వేల 752 మంది కరోనా నుండి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇంకా 3,423 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.


గత 24 గంటల్లో 013,చిత్తూరులో 042,తూర్పుగోదావరిలో 023, గుంటూరులో 053, కడపలో 009, కృష్ణాలో 032, కర్నూల్ లో 004, నెల్లూరులో 007, ప్రకాశంలో 008, శ్రీకాకుళంలో 005, విశాఖపట్టణంలో 013, విజయనగరంలో 00,పశ్చిమగోదావరిలో 005 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,292, మరణాలు 596
చిత్తూరు -85,978,మరణాలు 840
తూర్పుగోదావరి -1,23,604, మరణాలు 636
గుంటూరు -74,619, మరణాలు 664
కడప -54,924, మరణాలు 459
కృష్ణా -47,600,మరణాలు 664
కర్నూల్ -60,544, మరణాలు 487
నెల్లూరు -62,061, మరణాలు 505
ప్రకాశం -61,999, మరణాలు 578
శ్రీకాకుళం -45,918, మరణాలు 346
విశాఖపట్టణం -59,067, మరణాలు 550
విజయనగరం -41,008, మరణాలు 238
పశ్చిమగోదావరి -93,764, మరణాలు 535