అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో 78,784 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 2,107 మందికి కరోనా నిర్ధారణ అయింది

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో 78,784 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 2,107 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతోరాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19,62,049 కి చేరుకొంది.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 10 మంది మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13,332కి చేరింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గడిచిన 24 గంటల్లో 1807 మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 19 లక్షల 27వేల 438 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 21,279 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,44,03,410 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో అనంతపురంలో061,చిత్తూరులో 392, తూర్పుగోదావరిలో316, గుంటూరులో193,కడపలో 058, కృష్ణాలో303, కర్నూల్ లో038, నెల్లూరులో242, ప్రకాశంలో 200,విశాఖపట్టణంలో 163, శ్రీకాకుళంలో044, విజయనగరంలో 028, పశ్చిమగోదావరిలో 069కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో కరోనాతో 10 మంది చనిపోయారు. కృష్ణాలో ఆరుగురు, చిత్తూరు,అనంతపురంలలో నలుగురు చొప్పున కరోనాతో మరణించారు. అనంతపురం, తూర్పుగోదావరి,కడప, నెల్లూరు, విశాఖపట్టణం,పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,332కి చేరుకొంది.


ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,54,174, మరణాలు 1078
చిత్తూరు-2,30,399 మరణాలు1726
తూర్పుగోదావరి-2,76,677, మరణాలు 1210
గుంటూరు -1,67,705,మరణాలు 1139
కడప -1,10,083, మరణాలు 622
కృష్ణా -1,08,272,మరణాలు 1203
కర్నూల్ - 1,23,162,మరణాలు 840
నెల్లూరు -1,33,911,మరణాలు 953
ప్రకాశం -1,29,184, మరణాలు 993
శ్రీకాకుళం-1,20,501, మరణాలు 762
విశాఖపట్టణం -1,52,263, మరణాలు 1078
విజయనగరం -81,389, మరణాలు 668
పశ్చిమగోదావరి-1,69,434, మరణాలు 1060

Scroll to load tweet…