ఏపీపై కరోనా పంజా: మొత్తం కేసులు 4659కి చేరిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడం లేదు. గత 24 గంటల్లో 199 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 4,659కి చేరుకొన్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడం లేదు. గత 24 గంటల్లో 199 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 4,659కి చేరుకొన్నాయి.
గత 24 గంటల్లో 17695 మంది శాంపిల్స్ సేకరిస్తే 199 మందికి కరోనా సోకింది. అంతేకాదు కరోనా నుండి కోలుకోని 30 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో ఇద్దరు కరోనాతో మరణించారు.కర్నూల్ , కృష్ణా జిల్లాల్లో కరోనా వైరస్ తో మరణించినట్టుగా ఏపీ ప్రభుత్వం ఆదివారం నాడు ప్రకటించింది.
రాష్ట్రంలో 2353 మంది కరోనా నుండి కోలుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 1290 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా సోకి 75 మంది మరణించారు.
also read:సెప్టెంబర్‌లో ఇండియాలో కరోనా పూర్తిగా తగ్గే ఛాన్స్: నిపుణులు
విదేశాల నుండి రాష్ట్రానికి తిరిగి వచ్చిన వారిలో 131 మందికి కరోనా సోకింది. వీరిలో 126 కేసులు యాక్టివ్ కేసులు. వీరిలో ఒక్కరు ఇవాళ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చినవారిలో 810 మందికి కరోనా సోకింది.వీరిలో 508 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 28 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం ప్రకటించింది.