ఏపీలో భారీగా తగ్గిన కరోనామహమ్మారి: కొత్త కేసులు 1901 మాత్రమే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1901 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 08 వేల 924 కి చేరుకొన్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1901 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 08 వేల 924 కి చేరుకొన్నాయి.
గత 24 గంటల్లో 19 మంది కరోనా మరణించారు.కరోనాతో చిత్తూరులో నలుగురు, కడపలో ముగ్గురు, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇద్దరి చొప్పున మరణించారు. గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్టణం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరి చొప్పున మరణించారు. దీంతోరాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6,606కి చేరుకొంది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 76లక్షల 21వేల 896 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 51,544 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 1901 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది.
ఏపీలో ఇప్పటివరకు 7 లక్షల 73 వేల 548 మంది కరోనా నుండి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇంకా 28,770 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
గత 24 గంటల్లో అనంతపురంలో 021,చిత్తూరులో 289 తూర్పుగోదావరిలో 313, గుంటూరులో 295, కడపలో 085 కృష్ణాలో 074, కర్నూల్ లో 063 నెల్లూరులో 098,ప్రకాశంలో 104, శ్రీకాకుళంలో 018, విశాఖపట్టణంలో 085, విజయనగరంలో 059,పశ్చిమగోదావరిలో 397కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు
అనంతపురం -63,719, మరణాలు 551
చిత్తూరు -76,849,మరణాలు 769
తూర్పుగోదావరి -1,13,1673 మరణాలు 603
గుంటూరు -65,346 మరణాలు 609
కడప -51,252 మరణాలు 431
కృష్ణా -37,222 మరణాలు 551
కర్నూల్ -59,286 మరణాలు 481
నెల్లూరు -59,082 మరణాలు 485
ప్రకాశం -58,663 మరణాలు 567
శ్రీకాకుళం -43,551 మరణాలు 339
విశాఖపట్టణం -55,209 మరణాలు 502
విజయనగరం -38,953 మరణాలు 228
పశ్చిమగోదావరి -83,224 మరణాలు 490