ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1886 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 46వేల 245 కి చేరుకొన్నాయి.  


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1886 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 46వేల 245 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో 11మంది కరోనా మరణించారు.కరోనాతో చిత్తూరు, కృష్ణాలో ముగ్గురి చొప్పున చనిపోయారు.అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్టణం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరి చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6,814 కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 87లక్షల 92వేల 935 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 67,910 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో1886మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 18 వేల 473 మంది కరోనా నుండి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇంకా 20,958 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 60,చిత్తూరులో 291,తూర్పుగోదావరిలో 227 గుంటూరులో 275 కడపలో067, కృష్ణాలో 269, కర్నూల్ లో 33 నెల్లూరులో 79, ప్రకాశంలో 111, శ్రీకాకుళంలో 33, విశాఖపట్టణంలో 97, విజయనగరంలో 62,పశ్చిమగోదావరిలో 282 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -65,722 మరణాలు 574
చిత్తూరు -81,162మరణాలు 799
తూర్పుగోదావరి -1,19,157 మరణాలు 621
గుంటూరు -69,987 మరణాలు 633
కడప -53,281మరణాలు 444
కృష్ణా -42,148 మరణాలు 597
కర్నూల్ -59,791 మరణాలు 482
నెల్లూరు -60,519 మరణాలు 488
ప్రకాశం -60665, మరణాలు 575
శ్రీకాకుళం -44,761 మరణాలు 344
విశాఖపట్టణం -56914, మరణాలు 519
విజయనగరం -40,042,మరణాలు 230
పశ్చిమగోదావరి -89,201, మరణాలు 508