ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతుంది. మరో వైపు రాష్ట్రంలో కరోనా కేసులు బాగా తగ్గాయి. కరోనా కేసుల తగ్గుముఖం పట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కర్ఫ్యూ ఉపయోగపడిందని అధికారులు అభిప్రాయపడ్డారు. 

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో 71,152 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 1,628 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతోరాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19,41,724 కి చేరుకొంది.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 22 మంది మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13,154కి చేరింది. గడిచిన 24 గంటల్లో 2,744మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 19 లక్షల 05 వేల మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 23,570యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,36,64,207 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గత 24 గంటల్లో అనంతపురంలో036,చిత్తూరులో 261, తూర్పుగోదావరిలో291, గుంటూరులో112,కడపలో 092, కృష్ణాలో190, కర్నూల్ లో043, నెల్లూరులో241, ప్రకాశంలో 134,విశాఖపట్టణంలో 077, శ్రీకాకుళంలో027, విజయనగరంలో 025, పశ్చిమగోదావరిలో 099కేసులు నమోదయ్యాయి.గత 24 గంటల్లో కరోనాతో 22 మంది చనిపోయారు. చిత్తూరులో ఐదుగురు, కృష్ణాలో నలుగురు, గుంటూరు, ప్రకాశంలో ముగ్గురేసి చొప్పున చనిపోయారు.అనంతపురంలో ఇద్దరు, తూర్పుగోదావరి, కర్నూల్, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్టణం జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 23,570కి చేరుకొంది.


ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,55,614, మరణాలు 1075
చిత్తూరు-2,27,348 మరణాలు1687
తూర్పుగోదావరి-2,73,433, మరణాలు 1192
గుంటూరు -1,66,231,మరణాలు 1131
కడప -1,09,176, మరణాలు 616
కృష్ణా -1,06,026,మరణాలు 1171
కర్నూల్ - 1,22,902,మరణాలు 836
నెల్లూరు -1,31,641,మరణాలు 935
ప్రకాశం -1,26,789, మరణాలు 969
శ్రీకాకుళం-1,19,979, మరణాలు 756
విశాఖపట్టణం -1,51,078, మరణాలు 1071
విజయనగరం -81,126, మరణాలు 668
పశ్చిమగోదావరి-1,67,486, మరణాలు 1047

Scroll to load tweet…