ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: మొత్తం 8,85,985కి చేరిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 161 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 85వేల 985 కి చేరుకొన్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 161 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 85వేల 985 కి చేరుకొన్నాయి.
గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఒక్కరు మరణించారు. విశాఖపట్టణం జిల్లాలో కరోనాతో ఒక్కరు మరణించినట్టుగా అధికారులు తెలిపారు.దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,140కి చేరుకొంది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 1,25,76,272 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 36,091మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 161 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది.
గత 24 గంటల్లో 251 మంది కరోనా నుండి కోలుకొన్నారు. ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 76 వేల 949 మంది కరోనా నుండి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇంకా 1896 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
గత 24 గంటల్లో అనంతపురంలో 005, చిత్తూరులో 052,తూర్పుగోదావరిలో 012, గుంటూరులో 019, కడపలో 000, కృష్ణాలో 026, కర్నూల్ లో 006, నెల్లూరులో 003, ప్రకాశంలో 005, శ్రీకాకుళంలో 012, విశాఖపట్టణంలో 007 విజయనగరంలో 003,పశ్చిమగోదావరిలో 011 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు
అనంతపురం -67,558, మరణాలు 597
చిత్తూరు -86,785,మరణాలు 846
తూర్పుగోదావరి -1,24,067, మరణాలు 636
గుంటూరు -75,282, మరణాలు 668
కడప -55,158, మరణాలు 462
కృష్ణా -48,335,మరణాలు 676
కర్నూల్ -60,729, మరణాలు 487
నెల్లూరు -62,261, మరణాలు 506
ప్రకాశం -62,115, మరణాలు 580
శ్రీకాకుళం -46,065, మరణాలు 347
విశాఖపట్టణం -59,526, మరణాలు 558
విజయనగరం -41,106, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,103, మరణాలు 539