అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1608 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 25,422కి కరోనా కేసులు చేరుకొన్నాయి.

గత 24 గంటల్లో 21,020 మంది శాంపిల్స్ పరీక్షిస్తే 1608 మందికి కరోనా సోకిందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఒక్క రోజు వ్యవధిలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారిలో 32 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో 11,936  యాక్టివ్ కేసులు రికార్డయ్యాయి. కరోనా సోకినవారిలో ఇప్పటికి 13,194 మంది కోలుకొన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

 

కరోనాతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 292 మంది మరణించారు.రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాలో 2,939 కరోనా కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో2850 కేసులు రికార్డయ్యాయి. గుంటూరులో 2799 కేసులు, తూర్పు గోదావరిలో 2231 కేసులు, చిత్తూరులో2209 కేసులు నమోదైనట్టుగా ఏపీ ప్రభుత్వం తెలిపింది.

also read:7 రోజులుగా లేని ఆచూకీ: విజయవాడలో కరోనా భయంతో శ్రీనివాసరావు అనే వ్యక్తి అదృశ్యం

రాష్ట్రంలోని 11,15,635 మంది శాంపిల్స్ ను సేకరించారు. కరోనా సోకిన 11,936 మంది పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.గత 24 గంటల్లో కరోనాతో 15 మంది మరణించారు.అనంతపురం, చిత్తూరు, గుంటూరు,కృష్ణా, కర్నూల్ జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మరణించారు. నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరి చొప్పున మరణించారు.