7 రోజులుగా లేని ఆచూకీ: విజయవాడలో కరోనా భయంతో శ్రీనివాసరావు అనే వ్యక్తి అదృశ్యం
కరోనా భయంతో శ్రీనివాసరావు అనే వ్యక్తి వారం రోజులుగా కన్పించకుండా పోయాడు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా కూడ అతని ఆచూకీ కన్పించకుండా పోయింది.
విజయవాడ: కరోనా భయంతో శ్రీనివాసరావు అనే వ్యక్తి వారం రోజులుగా కన్పించకుండా పోయాడు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా కూడ అతని ఆచూకీ కన్పించకుండా పోయింది.
విజయవాడకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి కరోనా అనే అనుమానంతో కోవిడ్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకొన్నాడు. కరోనా వస్తోందనే భయంతో ఆయన వారం రోజులుగా కన్పించకుండా వెళ్లిపోయాడు.
దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారం రోజులుగా అతని ఆచూకీ లభ్యం దొరకలేదు.అయితే శ్రీనివాసరావుకు నెగిటివ్ వచ్చింది.కరోనా పాజిటివ్ వస్తోందనే భయంతో శ్రీనివాసరావు ఇంటి నుండి పారిపోయినట్టుగా కుటుంబసభ్యులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు గురువారం నాటికి 23,814కి చేరుకొన్నాయి. గురువారం నాడు ఒక్క రోజు 1555 కేసులు నమోదయ్యాయి.కరోనాతో రాష్ట్రంలో 277 మంది మరణించారు. కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 2795 కేసులు నమోదయ్యాయి. కర్నూల్ తర్వాతి స్థానంలో అనంతపురం జిల్లా నిలిచింది. కొద్ది రోజులుగా అనంతపురం జిల్లాలో కరోనా కేసులు నమోదౌతున్నాయి.
గతంలో కర్నూల్ తర్వాతి స్థానాల్లో గుంటూరు, కృష్ణా జిల్లాలు నిలిదేవి. ఈ రెండు జిల్లాలను కాదని అనంతపురం జిల్లా రెండో స్థానంలో నిలిచింది. అనంతపురంలో కరోనా కేసులు నమోదు కావడంపై అధికారులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.