ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 1539 కరోనా కేసులు నమోదయ్యాయి.  రాష్ట్రంలో కరోనా కేసులు 20,07,730 కి చేరుకొన్నాయి.రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 13,778కి చేరింది.  

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో67,590 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 1539 మందికి కరోనా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కరోనా కేసులు 20,07,730 కి చేరుకొన్నాయి.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 12 మంది మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13,778కి చేరింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

గడిచిన 24 గంటల్లో 1140మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 19 లక్షల 79వేల 504 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 14,448 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,63,37,946 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

గత 24 గంటల్లో అనంతపురంలో026,చిత్తూరులో 243, తూర్పుగోదావరిలో228,గుంటూరులో127,కడపలో 080, కృష్ణాలో194, కర్నూల్ లో015, నెల్లూరులో176, ప్రకాశంలో 126,విశాఖపట్టణంలో 092,శ్రీకాకుళంలో015, విజయనగరంలో 054,పశ్చిమగోదావరిలో 163 కేసులు నమోదయ్యాయి.


గత 24 గంటల్లో కరోనాతో 12 మంది చనిపోయారు.చిత్తూరు,కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున మరణించారు. ప్రకాశంలో ఇద్దరు, తూర్పుగోదావరి, కర్నూల్, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున కరోనాతో చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,778కి చేరుకొంది.


ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,57,030, మరణాలు 1091
చిత్తూరు-2,37,023, మరణాలు1829
తూర్పుగోదావరి-2,84,751, మరణాలు 1253
గుంటూరు -1,71,913,మరణాలు 1175
కడప -1,12,267, మరణాలు 629
కృష్ణా -1,13,074,మరణాలు 1292
కర్నూల్ - 1,23,739,మరణాలు 847
నెల్లూరు -1,39,464,మరణాలు 993
ప్రకాశం -1,33,082, మరణాలు 1041
శ్రీకాకుళం-1,21,833, మరణాలు 776
విశాఖపట్టణం -1,54,639, మరణాలు 1102
విజయనగరం -82,269, మరణాలు 669
పశ్చిమగోదావరి-1,73,751, మరణాలు 1080

<

Scroll to load tweet…

p>