ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1395  కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 56వేల 159 కి చేరుకొన్నాయి. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1395 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 56వేల 159 కి చేరుకొన్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గత 24 గంటల్లో 09 మంది కరోనా మరణించారు. కరోనాతో చిత్తూరు, కృష్ణా, విశాఖపట్టణం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. అనంతపురం, తూర్పుగోదావరి, కడపలో ఒక్కరిచొప్పున చనిపోయారు. 
 దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 6890కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 92 లక్షల 64వేల 085 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 66,778 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.వీరిలో 1395 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో2293 మందికి కరోనా నుండి కోలుకొన్నారు.

ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 32వేల 284 మంది కరోనా నుండి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇంకా 16,985 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 58,చిత్తూరులో 137,తూర్పుగోదావరిలో 214, గుంటూరులో 199, కడపలో 052, కృష్ణాలో 260, కర్నూల్ లో 018, నెల్లూరులో 032, ప్రకాశంలో 031, శ్రీకాకుళంలో 037, విశాఖపట్టణంలో 075, విజయనగరంలో 035,పశ్చిమగోదావరిలో 247 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -66,235, మరణాలు 582
చిత్తూరు -82,286,మరణాలు 812
తూర్పుగోదావరి -1,20,785, మరణాలు 627
గుంటూరు -71,245, మరణాలు 639
కడప -53,733,మరణాలు 446
కృష్ణా -43,533, మరణాలు 613
కర్నూల్ -59,972, మరణాలు 483
నెల్లూరు -60,930, మరణాలు 491
ప్రకాశం -61,018, మరణాలు 576
శ్రీకాకుళం -45,081, మరణాలు 345
విశాఖపట్టణం -57,395, మరణాలు 529
విజయనగరం -40,330,మరణాలు 233
పశ్చిమగోదావరి -90,721, మరణాలు 514

Scroll to load tweet…