అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 గంటల్లో 1178 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 21,197కి చేరుకొన్నాయి.

24 గంటల్లో విదేశాల నుండి వచ్చినవారిలో ఒక్కరికి ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన 22 మందికి కరోనా  సోకింది. ఒక్క రోజు వ్యవధిలో 16,238 శాంపిల్స్ పరీక్షిస్తే 1178 మందికి కరోనా సోకినట్టుగా తేలిందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది

 

24 గంటల్లో 762 మంది కరోనా నుండి కోలుకొన్నారు. ఒక్కరోజు వ్యవధిలో కరోనాతో 13 మంది మరణించినట్టుగా ఏపీ ప్రభుత్వ హెల్త్ బులెటిన్ గణాంకాలు చెబుతున్నాయి.

also read:ఒక్క రోజులోనే 22,252 కరోనా కేసులు: ఇండియాలో మొత్తం 7,19,665కి చేరిక

రాష్ట్రంలో ఇప్పటివరకు 10,50,090 మంది శాంపిల్స్ పరీక్షించారు. రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో 10,254  మంది చికిత్స పొందుతున్నట్టుగా ప్రభుత్వం వివరించింది.

రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ జిల్లాలో 2671 కేసులు నమోదైనట్టుగా ప్రభుత్వం తెలిపింది. అనంతపురం జిల్లా రెండో స్థానంలో నిలిచింది. అనంతపురంలో 2481 కేసులు రికార్డయ్యాయి. గుంటూరు జిల్లాలో 2262 కరోనా కేసులు నమోదయ్యాయి. 

కరోనా సోకి రాష్ట్రంలో ఇప్పటివరకు 252 మంది మరణించారు. కరోనా నుండి కోలుకొన్న వారి సంఖ్య 9745గా ఉందని ప్రభుత్వం ప్రకటించింది.