ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 1,178 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 10 మంది మృత్యువాతపడ్డారు.ఏపీలో ప్రస్తుతం 14,552 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,70,37,651 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో మంది 54,970 శాంపిల్స్ ను పరీక్షిస్తే 1,178 మందికి కరోనా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కరోనా కేసులు 20,23,242 కి చేరుకొన్నాయి.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 10 మంది మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13,935 కి చేరింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

గడిచిన 24 గంటల్లో 1266 మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 19 లక్షల 94వేల 855 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 14,552 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,70,37,651 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

గత 24 గంటల్లో అనంతపురంలో017,చిత్తూరులో 204, తూర్పుగోదావరిలో072,గుంటూరులో135,కడపలో 015, కృష్ణాలో151, కర్నూల్ లో034, నెల్లూరులో177, ప్రకాశంలో 118,విశాఖపట్టణంలో 074,శ్రీకాకుళంలో048, విజయనగరంలో 009,పశ్చిమగోదావరిలో 124 కేసులు నమోదయ్యాయి.


గత 24 గంటల్లో కరోనాతో 10 మంది చనిపోయారు.కృష్ణ, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరి చొప్పున కరోనాతో చనిపోయారు. చిత్తూరు, తూర్పు గోదావరి, విశాఖపట్టణం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున కరోనాతో రోగులు చనిపోయారు.దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,935కి చేరుకొంది.


ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,57,270, మరణాలు 1092
చిత్తూరు-2,39,599, మరణాలు1864
తూర్పుగోదావరి-2,87,007, మరణాలు 1264
గుంటూరు -1,73,372,,మరణాలు 1186
కడప -1,13,174, మరణాలు 631
కృష్ణా -1,14,688,మరణాలు 1332
కర్నూల్ - 1,23,888,మరణాలు 850
నెల్లూరు -1,41,403,మరణాలు 1014
ప్రకాశం -1,34,506, మరణాలు 1060
శ్రీకాకుళం-1,22,276, మరణాలు 779
విశాఖపట్టణం -1,55,421, మరణాలు 1107
విజయనగరం -82,531, మరణాలు 669
పశ్చిమగోదావరి-1,75,212, మరణాలు 1087

Scroll to load tweet…