AP Corona: ఏపీలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులో 14,440 కేసులు
AP Corona: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 46, 650 శాంపిల్స్ పరీక్షించగా 14,440 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
AP Corona: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి. గతవారంలో ఐదు వేలు, ఆరు వేలు నమోదు అయినా కేసులు సంక్రాంతి తర్వాత ఒక్కసారిగా కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. తాజాగా ఈరోజు 46,650 శాంపిల్స్‌ను పరీక్షించగా 14,440 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇందులో అత్యధికంగా.. విశాఖ జిల్లాలో 2258 కేసులు నమోదు కాగా.. చిత్తూరు జిల్లాలో 1198 కేసులు, అనంతపురం జిల్లాలో 1534 కేసులు, గుంటూరు జిల్లాలో 1458 కేసులు, ప్రకాశం జిల్లాలో 1399 కేసులు నమోదనట్టు ఆర్యోగ నిపుణులు వెల్లడించారు. ఇతర జిల్లాల్లోనూ అదే స్థాయిలో కొత్త కేసులు గుర్తించారు.
ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 3,969 మంది కొవిడ్ నుంచి సంపూర్ణంగా కోలుకున్నట్లు వెల్లడించింది ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 20,82,482 మంది కరోనాను జయించారు.
ఇదే సమయంలో కరోనాతో ఈ రోజు 4 మృతి చెందారు. కరోనా కారణంగా విశాఖ జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ఒకరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఒకరు ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14538కు చేరింది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 83,610 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. రాష్ట్రంలో మొత్తం 3,21,47,031 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది ఏపీ ఆరోగ్య శాఖ. అందులో 2,180,634 శాంపిళ్లు పాజిటివ్‌గా తేలినట్లు వివరించింది.