Asianet News TeluguAsianet News Telugu

Crime: వీడిన తిరుపతి మహిళ మ‌ర్డ‌ర్ మిస్టరీ.. వైజాగ్ లో వరుస హత్యలు.. !

Tirupati: తిరుపతిలోని 73 ఏళ్ల వృద్ధురాలి బంగారు గొలుసును దొంగిలించి, హత్య చేసి మృతదేహాన్ని డ్రైనేజీ కాలువలో పడేసిన ఆరోపణలపై ఇద్దరు మహిళలతో సహా ముగ్గురిని తిరుపతి తూర్పు డివిజన్ పోలీసులు అరెస్టు చేశారు.
 

Andhra Pradesh: Police solved Tirupati woman murder case; Three arrested
Author
Hyderabad, First Published Aug 17, 2022, 10:39 AM IST

Tirupati women's murder mystery: తిరుపతిలోని 73 ఏళ్ల వృద్ధురాలి బంగారు గొలుసును దొంగిలించి హ‌త్య చేసిన మ‌ర్డర్ మిస్ట‌రీ వీడింది. ఈ దారుణానికి ఒడిక‌ట్టిన ముగ్గురు నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న గురించి తిరుప‌తి పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. తిరుపతిలోని 73 ఏళ్ల వృద్ధురాలి బంగారు గొలుసును దొంగిలించి, హత్య చేసి మృతదేహాన్ని డ్రైనేజీ కాలువలో పడేశార‌నే  ఆరోపణలపై ఇద్దరు మహిళలతో సహా ముగ్గురిని తిరుపతి తూర్పు డివిజన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

మృతురాలు టీటీడీ సెక్యూరిటీ గార్డుగా పనిచేసి ప్రస్తుతం భవానీనగర్‌లో నివాసముంటున్న ఎం రామప్ప భార్య రాజేశ్వరి (73)గా గుర్తించారు. ఆమె న‌గ‌లు దొంగిలించి.. హ‌త్యా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నిందిదుతులు మృతురాలి ఇరుగుపొరుగువారు కావ‌డం గ‌మ‌నార్హం. నిందితుల‌ను షేక్ చాందిని (41), షేక్ కరీమున్నీసా (41), షేక్ సబ్సన్ (48)గా పోలీసులు వెల్ల‌డించారు. డీఎస్పీ టి.మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. చాందిని, కరీమున్నీసా ఆగస్టు 10న ఉదయం రాజేశ్వరి ఇంటికి వెళ్లి చాందిని ఇంట్లో పార్టీ కోసం బయటకు రావాలని కోరారు. ముగ్గురు మహిళలు తర్వాత మద్యం దుకాణానికి వెళ్లి కొంత మద్యం కొనుగోలు చేశారు. తరువాత వారు చాందిని ఇంట్లో తాగారు. రాజేశ్వరి మద్యం మత్తులో ఉన్నప్పుడు ఆమె వద్ద ఉన్న బంగారు గొలుసును ఇద్దరు మహిళలు దొంగిలించారు. ఆమె స్పృహలోకి వచ్చి బంగారు గొలుసు గురించి వారిని అడగగా, వారు భిన్నమైన సమాధానాలు చెప్పారు. దీంతో బాధితురాలు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పింది.

దీంతో ఆందోళ‌న‌కు గురైన నిందితులు.. ఇద్దరు మహిళలు బాధితురాలిపై ఇటుకలతో అత్యంత క్రూరంగా దాడి చేసి హత్య చేశారు’’ అని డీఎస్పీ టి.మురళీకృష్ణ మీడియాకు వెల్ల‌డించారు. అనంతరం చాందిని భర్త షేక్ సబ్సన్ సహాయంతో మహిళలు మృతదేహాన్ని డ్రెయిన్ కెనాల్‌లో పడేశారు. అదే రోజు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు తూర్పు సీఐ బీవీ శివప్రసాద్‌, ఎస్‌ఐ జయస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలు హత్య కేసును ఛేదించడంలో.. నిందితులను పట్టుకోవడంలో సహాయపడ్డాయి.

విశాఖ‌ప‌ట్నంలో మ‌రో హ‌త్య‌.. 

వైజాగ్ సిటీ ప్రాంతంలోని పెందుర్తి పోలీస్‌స్టేషన్  పరిధిలోని చినముషిడివాడలోని సుజాతనగర్‌లో నిర్మాణంలో ఉన్న స్థలంలో 47 ఏళ్ల మహిళ హత్యకు గురైంది. పెందుర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ వారంలో ఇదే పద్ధతిలో జరిగిన మూడో హత్య కావ‌డం గ‌మనార్హం. వ‌రుస‌గా చోటుచేసుకుంటున్న ఈ హత్యలు స్థానిక నివాసితులలో భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో మృతురాలు ఎ లక్ష్మి తలపై బలమైన గాయాలతో రక్తపు మడుగులో ఉంది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గనిశెట్టిపాలెం గ్రామానికి చెందిన లక్ష్మి, అతని భర్త ఎ దేముడుబాబు ఆ స్థలంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు.

లక్ష్మి తలపై కర్రతో కొట్టడం వల్లే ఆమె మృతి చెందిందని ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు తెలిపారు. హత్య జరిగిన సమయంలో లక్ష్మి భర్త దేముడుబాబు మరోచోట ఉన్నాడు. పెందుర్తిలో గత ఏడు రోజుల్లో ముగ్గురు వ్యక్తులు హత్యకు గురికాగా, నిందితుడు ఒక్కరే అయివుంటారని స్థానికులు భావిస్తున్నారు. ఇది సీరియల్ కిల్లర్ పనేనంటూ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో అత్యాచారం, హత్య జరిగిందనే కోణంలో ఆధారాలు లభించాయని పెందుర్తి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జి అశోక్ కుమార్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios