చింతమనేనికి చుక్కలే చుక్కలు: మరో కేసు నమోదు

టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడ్డారని చింతమనేని ప్రభాకర్‌పై పోలీసులు కేసు పెట్టారు.

Andhra Pradesh Police Files Case Against TDP leader Chintamaneni Prabhakar

హైదరాబాద్:టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై మంగళవారం నాడు మరో కేసు నమోదైంది. తనను బెదిరించాడని జోసెఫ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు  పోలీసులు చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు చేశారు. చింతమనేని ప్రభాకర్ ప్రస్తుతం జిల్లా జైల్లో ఉన్నాడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఏపీ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  చింతమనేని ప్రభాకర్ పై దళితులను దూషించాడనే కేసు నమోదైంది.

ఈ కేసులో చింతమనేని ప్రభాకర్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ 11వ తేదీన అరెస్టయ్యాడు. ఈ కేసుతో పాటు గతంలో నమోదైన కేసుల్లో చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు విచారిస్తున్నారు.

చింతమనేని ప్రభాకర్‌ తమను బెదిరించాడని కూడ కొందరు ఫిర్యాదు చేస్తున్నారు. చింతమనేని ప్రభాకర్ జైల్లో ఉన్న సమయంలోనే ఆయనపై పలువురు ఫిర్యాదులు చేస్తుండడం గమనార్హం.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కూడ చింతమనేని ప్రభాకర్‌పై పలు కేసు నమోదయ్యాయి. ఏపీ రాష్ట్రం ఏర్పడైన తర్వాత   టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చింతమనేని ప్రభాకర్ పై పలు కేసులు నమోదయ్యాయి.

అయినా కూడ చింతమనేని ప్రభాకర్‌ వైఖరిలో మార్పు రాలేదు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి  ఉన్న సమయంలో   ఉద్దేశ్యపూర్వకంగానే తనపై కేసులు నమోదు చేశారని చింతమనేని ప్రభాకర్  ఆరోపించారు. 

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దెందులూరు అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్ధిగా బరిలో ఉన్న చింతమనేని ప్రభాకర్ కూడ ఓటమి పాలయ్యాడు.

చింతమనేని ప్రభాకర్ ఓటమి చెందగానే ఆయనపై ఉన్న పాత కేసులు తిరగతోడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి చింతమనేని ప్రభాకర్ ను వేధింపులకు గురిచేస్తున్నారని టీడీపీ నేతలు వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ కేసుల్లో జిల్లా జైలులో ఉన్న చింతమనేని ప్రభాకర్‌  తనను బెదిరించాడని జోసెఫ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఫోన్‌లో తనను బెదిరించాడని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ ఫోన్ లో జోసెఫ్ ను ఎలా బెదిరించాడని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఏపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కీలకమైన టీడీపీ నేతలపై కేసులు నమోదౌతున్నాయి. కోడెల శివప్రసాదరావు కుటుంబసభ్యులపై  మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావులపై నమోదైన కేసుల గురించి టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios