కారణమిదీ:సంగం డెయిరీ చైర్మెన్ దూళిపాళ్ల నరేంద్రపై మరో కేసు

సంగం డెయిరీ చైర్మెన్,మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రపై  మరో కేసు నమోదైంది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ఓ హోటల్ లో సంగం డెయిరీ పాలకవర్గం సమావేశం నిర్వహించడంపై  పోలీసులు కేసు నమోదు చేశారు. 

Andhra pradesh police files case against dhulipalla narendra lns

అమరావతి: సంగం డెయిరీ చైర్మెన్,మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రపై  మరో కేసు నమోదైంది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ఓ హోటల్ లో సంగం డెయిరీ పాలకవర్గం సమావేశం నిర్వహించడంపై  పోలీసులు కేసు నమోదు చేశారు. సంగం డెయిరీలో అక్రమాలకు పాల్పడ్డారనే  ఫిర్యాదుపై  దూళిపాళ్ల నరేంద్రతో పాటు ఎండీ గోపాలకృష్ణను అరెస్ట్ చేశారు.  ఈ కేసులో అరెస్టైన  నరేంద్ర బెయిల్ పై విడుదలపై జైలు నుండి బయటకు వచ్చారు.  

జైలు నుండి బయటకు వచ్చిన దూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. కోవిడ్ నిబంధనలకు విరుద్దంగా ఈ సమావేశం నిర్వహించారని ఆయనపై కేసు నమోదు చేశారు.సంగం డెయిరీని ప్రభుత్వం పరం చేస్తూ ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొంది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ సంగం డెయిరీ దాఖలు చేసిన పిటిషన్ పై డెయిరీకి అనుకూలంగా ఏపీ హైకోర్టు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సంగం డెయిరీని ప్రభుత్వం పరం చేస్తూ ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొంది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ సంగం డెయిరీ దాఖలు చేసిన పిటిషన్ పై డెయిరీకి అనుకూలంగా ఏపీ హైకోర్టు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.దూళిపాళ్ల నరేంద్రను లక్ష్యంగా చేసుకొని కేసులు పెట్టేందుకుగాను సంగం డెయిరీని పావుగా వాడుకొన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios