ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. మార్కాపురంలోని జార్జి ఇంజనీరింగ్ కాలేజీలో ఈరోజు ఉదయం వాకింగ్ చేస్తండగా ఆదిమూలపు సురేష్ అస్వస్థతకు లోనయ్యారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. మార్కాపురంలోని జార్జి ఇంజనీరింగ్ కాలేజీలో ఈరోజు ఉదయం వాకింగ్ చేస్తండగా ఆదిమూలపు సురేష్ అస్వస్థతకు లోనయ్యారు. లో బిపి, ఆయాసంతో ఇబ్బంది పడ్డారు. దీంతో డాక్టర్లు అక్కడి చేరుకుని ఆయనకు పరీక్షలు నిర్వహించారు. బీపీలో హెచ్చుతగ్గుల వల్లే ఆయన అస్వస్థతకు లోనైనట్టుగా చెప్పారు. ప్రస్తుతం ఆదిమూలపు సురేష్ తన జార్జి ఇంజనీరింగ్ కాలేజీలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం మంత్రి ఆదిమూలపు సురేష్ అస్వస్థలకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ యశోద హాస్పిటల్‌లో మంత్రి సురేష్‌కు వైద్యులు యాంజియోగ్రామ్ చేశారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదిమూలపు సురేష్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అయితే ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న కొద్దిరోజులకే ఆదిమూలపు సురేష్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు.
