ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ముందుగా ప్రకటించిన ఇంటర్ పరీక్షల తేదీలతో జేఈఈ మెయిన్ పరీక్షల తేదీలో క్లాష్ కావడంతో.. ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఇంటర్ పరీక్షల కొత్త తేదీలను ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ముందుగా ప్రకటించిన ఇంటర్ పరీక్షల తేదీలతో జేఈఈ మెయిన్ పరీక్షల తేదీలో క్లాష్ కావడంతో.. ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఇంటర్ పరీక్షల కొత్త తేదీలను ప్రభుత్వం గురువారం ప్రకటించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 22న పరీక్షలు మొదలై మే 12 వరకు జరగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ గురువారం ప్రకటన చేసింది. మరోవైపు ఇంటర్ ప్రాక్టికట్స్ పరీక్షలను గతంలో ప్రకటించిన తేదీల్లోనే నిర్వహించనున్నట్టుగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. దీంతో ముందుగా ప్రకటించినట్టుగానే మార్చి 11 నుంచి 31 మధ్య ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు జరగున్నాయి. 

తొలుత ప్రకటించాల్సిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షలు.. ఏప్రిల్‌ 8 నుంచి ప్రారంభమై 28వ తేదీతో పూర్తవ్వాలి. అయితే జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు జరగనున్నాయి. ఎగ్జామ్స్ డేట్స్ క్లాష్ కావడంతో విద్యార్థులు ఇంటర్ పరీక్షల తేదీలను మార్చాలని కోరారు. దీనిపై ఏపీ విద్యా శాఖ సానుకూలంగా స్పందించింది. 

ఈ నేపథ్యంలోనే ఇంటర్‌ పరీక్షలను మొత్తం వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్షలకు కొత్త తేదీలను ఖరాలు చేసింది. ఏప్రిల్‌ 22న పరీక్షలు మొదలై మే 12 వరకు జరుగుతాయని తెలిపింది.