ఎనిమిది మంది ఐఎఎస్‌లకు ఏపీ హైకోర్టు షాక్: కోర్టు ధిక్కరణ కేసులో జైలు శిక్ష, క్షమాపణలు కోరిన ఐఎఎస్‌లు
కోర్టు ధిక్కరణలో ఎనిమిది మంది ఐఎఎస్‌లకు జైలు శిక్ష విధిస్తూ ఏపీ హైకోర్టు గురువారం నాడు తీర్పు చెప్పింది. అయితే ఈ విషయంలో ఏపీ హైకోర్టుకు ఐఎఎస్ లు క్షమాపణలు చెప్పారు. జైలు శిక్షకు బదులుగా సేవా కార్యక్రమాలు చేయాలని కోర్టు ఆదేశించింది.
అమరావతి: కోర్టు ధిక్కరణ కేసులో ఎనిమిది మంది ఐఎఎస్ లకు జైలు శిక్ష విధించింది AP High Court అయితే ఈ విషయమై ఏపీ హైకోర్టుకు ఐఎఎస్ లు క్షమాపణ చెప్పడంతో Jail శిక్షకు బదులుగా సేవా కార్యక్రమాలు చేయాలని ఉన్నత న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసింది.
విజయ్ కుమార్, గోపాలకృష్ణద్వివేది, శ్యామలారావు, రాజశేఖర్, శ్రీలక్ష్మి, గిరిజా శంకర్, చిన వీరభద్రుడు, ఎంఎంనాయక్ లపై హైకోర్టు సీరియస్ అయింది. పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయవద్దని ఆదేశాలను హైకోర్టు గతంలో జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను IAS లు అమలు చేయలేదు. దీంతో కోర్టు ధిక్కరణ కింద ఎనిమిది మంది ఐఎఎస్‌లకు రెండు వారాల పాటు జైలు శిక్షను విధించింది.
ఈ విషయమై ఐఎఎస్ లు కోర్టును క్షమాపణలు కోరారు. దీంతో సంక్షేమ హాస్టళ్లలో సేవా కార్యక్రమాలు చేయాలని ఐఎఎస్ లను కోర్టు ఆదేశించింది. జైలు శిక్షకు బదలుగా హాస్టల్ విద్యార్ధులకు సేవ చేయాలని సూచించింది.ప్రతి నెల ఏదో ఒక రోజు సంక్షేమ హాస్టళ్లలో ఐఎఎస్ లు సేవ చేయాలని సూచించింది. అంతేకాదు ఒక రోజు పాటు కోర్టు ఖర్చులను కూడా భరించాలని ఆదేశించింది.
2021 సెప్టెంబర్ మాసంలో కూడా ఐఎఎస్ అధికారి మన్మోహన్ సింగ్ సహా ఐదుగురు ఐఎఎస్ అధికారులకు కూడా ఏపీ హైకోర్టు శిక్ష విధించింది. నాలుగు వారాల పాటు జైలు శిక్ష విధించింది. అంతేకాదు జరిమానాను విధించింది.
గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయని కారణంగా కూడా హైకోర్టు ఈ శిక్ష విధించింది. తాజాగా ఎనిమిది మంది ఐఎఎస్ అధికారులకు కూడా జైలు శిక్ష విధించింది. అయితే ఐఎఎస్ లు క్షమాపణ కోరడంతో ఉన్నత న్యాయస్థానం సంక్షేమ హాస్టళ్లలో సేవా కార్యక్రమాలు చేయాలని ఆదేశించింది.