అమరావతి:ఇతర రాష్ట్రాల నుండి మద్యం తెచ్చుకోవడంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.411 జీవో ప్రకారంగా 3 మద్యం బాటిళ్లను తీసుకురావచ్చని ఏపీ హైకోర్టు చెప్పింది. అయితే ఈ జీవోను అమలు చేయాాలని రిట్ పిటిషన్ లో  తీర్పు ఇచ్చిన హైకోర్టు.  

అయితే ఇతర రాష్ట్రాల నుండి ఏపీ రాష్ట్రంలోకి  మద్యం బాటిళ్లు తీసుకువస్తే ఎస్ఈబీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు.అయితే అరెస్ట్ విషయమై మాత్రం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. 

రాష్ట్రంలో దశలవారీగా మద్యాన్ని నియంత్రిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మద్యం బాటిళ్ల ధరలను భారీగా పెంచారు. దీంతో తెలంగాణ రాష్ట్రం నుండి మద్యాన్ని ఏపీ రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఇలా తరలించే క్రమంలో రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసులకు చిక్కుతున్నారు.