హైదరాబాద్: ఏపీలో కొత్త మద్యం పాలసీపై హైకోర్టు సోమవారం నాడు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.  విధించింది. యదాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది.

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకొస్తూ నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ  మద్యం వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది. 

బార్ లైసెన్సుల ఉపసంహారణపై హైకోర్టు స్టే విధించింది. బార్ లైసెన్స్‌లను  ప్రభుత్వం ఉపసంహరించడాన్ని బార్ యజమానులు సవాల్ చేశారు. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆరు వారాల పాటు ఈ ప్రక్రియను నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు విచారణను ఆరు వారాల పాటు వాయిదా వేసింది హైకోర్టు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మద్యాన్ని దశలవారీగా నిషేదించనున్నట్టుగా సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.ఈ హామీలో భాగంగానే ఈ ఏడాది అక్టోబర్ నుండి కొత్త మద్యం పాలసీని అమలు చేశారు. 

ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడపనుంది.ప్రైవేట్ లైసెన్స్ ల గడువు ముగియడంతో రాష్ట్రంలోని 4380 మద్యం దుకాణాలు మూతపడ్డాయి. వీటి స్థానంలో ప్రభుత్వమే 3600 మద్యం దుకాణాలను ప్రారంభంచారు.  ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచుతారు.కొత్త మధ్యం పాలసీపై బార్ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు.