ఆంధ్రప్రదేశ్‌లో భారీగా  ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. రాష్ట్రంలోని 39 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. 

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. రాష్ట్రంలోని 39 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గురువారం రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ చేపట్టిన సంగతి తెలిసిందే. ఎనిమిది కొత్త జిల్లాల కలెక్టర్లతో సహా 54 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం, కొత్త పోస్టింగ్‌లు ఇవ్వడం చేసింది. అయితే తాజా 39 మంది ఐపీఎస్‌ల బదిలీ చేసింది. 

వివరాలు.. 
1. విశాఖ పోలీసు కమిషనర్‌గా త్రివిక్రమ్ వర్మ
2. సీఐడీ ఐజీగా సీహెచ్ శ్రీకాంత్
3. విశాఖ డీసీపీగా వాసన్ విద్యాసాగర్ నాయుడు
4. నెల్లూరు ఎస్పీగా తిరుమలేశ్వర్ రెడ్డి
5. తూర్పు గోదావరి ఎస్పీగా సుధీర్ కుమార్ రెడ్డి
6 ఏలూరు ఎస్పీగా మేరీ ప్రశాంతి
7. అన్నమయ్య జిల్లా ఎస్పీగా ఆర్‌ గంగాధరావు
8.అంబేడ్కర్ కొనసీమ ఎస్పీగా శ్రీధర్
9.విజయవాడ రైల్వే ఎస్పీగా రాహుల్‌దేవ్ సింగ్
10. సీఐడీ ఎస్పీగా హర్షవర్దన్ రాజు
11. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్
12. ఎస్‌ఐబీ ఎస్పీగా జి సుమిత్ కుమార్
13. అల్లూరి జిల్లా ఎస్పీగా తుహిన్ సిన్హా
14. కాకినాడ ఎస్పీగా ఎస్ సతీష్‌కుమార్
15. అనకాపల్లి ఎస్పీగా కేవీ మురళీకృష్ణ
16. దిశ ఐజీగా పాలరాజు
17. అనంతపురం డీఐజీగా అమ్మిరెడ్డి
18. అనంతపురం ఎస్పీగా కే శ్రీనివాసరావు
19. సీఐడీ ఎస్పీగా ఫకీరప్ప
20. సత్యసయి జిల్లా ఎస్పీగా మాధవరెడ్డి
21. కర్నూలు ఎస్పీగా కృష్ణకాంత్
22. అక్టోపస్ ఎస్పీగా సిద్దార్థ్ కౌశల్
23. ఏలూరు రేంజ్ డీఐజీగా జీవీజీ అశోక్ కుమార్
24. సెబ్ డీఐజీగా ఎం రవిప్రకాష్
25. డీఐజీ(అడ్మిన్)గా సర్వ శ్రేష్ట త్రిపాఠి
26. ఏపీఎస్‌పీ డీఐజీగా బి రాజకుమారి
27. విజయవాడ డీసీపీగా అజిత వేజండ్ల
28. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా శంఖా బ్రాగ్చీ
29. గ్రే హౌండ్స్ డీఐజీగా కోయ ప్రవీణ్
30.ఎక్స్ అఫిషియో ప్రన్సిపల్ సెక్రటరీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏడీజీగా రవిశంక్ అయ్యన్నార్
31. ఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్‌గా అతుల్ సింగ్ (అదనంగా ఏపీఎస్‌పీ ఏడీజీపీగా)
32. ఏపీపీహెచ్‌సీ ఎండీగా పి వెంకటరామిరెడ్డి(అదనపు బాధ్యతలు)
33. గ్రేహౌండ్స్ ఎస్పీగా బింధుమాధవ్
34. ఏపీఎస్‌పీ 16వ బెటాలియన్ కమాండెంట్ గౌతమి శాలి
35. 5వ బెటాలియన్ కమాండెంట్‌గా రాహుల్ దేశ్ శర్మ
36. 3వ బెటాలియన్ కమాండెంట్‌గా విజయరావు
37. 14వ బెటాలియన్ కమాండెంట్‌గా జగదీష్
38. మనీస్ కుమార్ సిన్హా-సెలవులో వెళ్లారు
39. రవీంద్రనాథ్ బాబు- పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలి