12 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

బదిలీ అయిన అధికారులు:

* పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా అమిత్ గార్గ్.. దీనితో పాటు పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్‌ ఎండీగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. 
* గుంటూరు రూరల్ ఎస్పీగా సీహెచ్ విజయారావు
* విజయవాడ డీసీపీ-2గా విక్రాంత్ పాటిల్
* చిత్తూరు ఎస్పీగా సెంథిల్ కుమార్
* ఇంటెలిజెన్స్ ఎస్పీగా సీహెచ్ వెంకటప్పల నాయుడు
* కడప ఎస్పీగా కెఎన్ అన్బురాజన్ 
* తిరుపతి అర్బన్ ఎస్పీగా గజారావు భూపాల్
* ఏఐజీ అడ్మిన్‌గా భాస్కర్ భూషణ్
* విజయవాడ డీసీపీ (అడ్మిన్‌)గా హరికృష్ణ
* సీఏడీ అడిషనల్ డీజీగా పీవీ సునీల్ కుమార్
* ట్రాన్స్‌కో విజిలెన్స్ జేఎండీగా కె. వెంకటేశ్వరరావు
* లా అండ్ ఆర్డర్ ఏఐజీగా ఎస్.వి. రాజశేఖర్ బాబు