మున్సిపల్ కార్మికులతో ఏపీ మంత్రుల చర్చలు విఫలం: సమ్మె కొనసాగిస్తామన్న కార్మిక సంఘాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులతో చర్చలు విఫలమయ్యాయి. సోమవారం నాడు  సాయంత్రం మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ లు  కార్మిక సంఘాల నాయకులతో చర్చించారు. ఈ చర్చలు విఫలమయ్యాయి. 

Andhra Pradesh government talks with Municipal  Workers fail

అమరావతి:Andhra Pradesh రాష్ట్రంలో Municipal Workers తో చర్చలు విఫలమయ్యాయి. సోమవారం నాడు సాయంత్రం మంత్రులు Botsa Satyanarayana, Audimulapu Suresh, సమ్మె చేస్తున్న కార్మిక సంఘాల నేతలతో చర్చించారు. ప్రభుత్వానికి, కార్మిక సంఘాల నేతల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి.  సమ్మెను కొనసాగిస్తామని కార్మిక సంఘాలు ప్రకటించాయి.  రూ. 3 వే హెల్త్ అలవెన్స్ ను పెంచాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. అయితే ఈ విషయమై  ప్రభుత్వానికి, కార్మిక సంఘాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ఈ హెల్త్ అలవెన్స్ పెంచాలనే  కార్మిక సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రాలేదు. దీంతో సమ్మెను కొనసాగిస్తామని కార్మిక సంఘాలు ప్రకటించాయి.

తాము లేవనెత్తిన ప్రధాన సమస్యల పరిష్కారానికి ఏపీ సర్కార్ ఒప్పుకోలేదని ఏపీ మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ ఉమా మహేశ్వరరావు చెప్పారు. కొన్ని సమస్యలు మాత్రమే పరిష్కరస్తామని ప్రభుత్వం ప్రకటించిందని కార్మిక సంఘాల ఆయన చెప్పారు.  అసెంబ్లీలో చెప్పిన మాటను నిలుపుకోవాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. .జీతం, అలవెన్స్ ను రూ. 21 వేలకు పెంచాలని  ఆయన డిమాండ్ చేశారు. 

హెల్త్ కార్డులు, మరణానంతరం వచ్చే బెనిఫిట్స్ సహా 20 సమస్యలను ప్రభుత్వం ముందుంచారని మరో మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. కార్మికుల సమస్యల పై చర్చించామన్నారు. గత ప్రభుత్వాలు  కార్మికుల సమస్యలను గాలికి వదిలేశాయన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీతాలు గణనీయంగా పెంచినట్టుగా మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు ముఖ్యమంత్రి కార్మికుల సమస్యల పై మానవీయ దృక్పధంతో వ్యవహరించారన్నారు. హెల్త్ కార్డులు. మరణానంతరం వచ్చే బెన్ఫిట్స్ తో పాటు ఇరవై సమస్యలను తమ ముందు ఉంచారన్నారు. ప్రభుత్వం జరిపిన చర్చల పై కార్మికులు సంతృప్తి వ్యక్తం చేశారని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఇంకా సమస్యలు ఉంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. 

జీతం, అలవెన్స్ తో పాటు 20 సమస్యలపై చర్చించినట్టుగా మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. కార్మిక సంఘాలతో చర్చలు పూర్తైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. వేతనం, అలవెన్స్ రూపంలో రూ. 18 వేలు ఇస్తున్నామన్నారు. ఇంకా అలవెన్స్  రూపంలో మరో రూ. 3 వేలు పెంచాలని కార్మికులు కోరుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. 

మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం  80 శాతం జీతాలు పెంచినా కూడా ఇంకా పెంచాలని కోరడం సరికాదని మంత్రి బొత్స సత్యనారాయణ కార్మిక సంఘాల నేతలను కోరారు.ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కార్మికులు విధులు నిర్వహించాలని మంత్రి కోరారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios