ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపు ప్రతిపాదన అందింది:కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపు ప్రతిపాదన కేంద్రానికి అందిందని కేంద్రమంత్రి రిజిజు చెప్పారు. శుక్రవారం నాడు వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు రిజిజు సమాధానం చెప్పారు.

Andhra Pradesh Government Sent High Court Shifting proposal :union Minister Kiren Rijiju

న్యూఢిల్లీ: Andhra Pradesh హైకోర్టు  తరలింపు ప్రతిపాదన కేంద్రానికి అందిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు.శుక్రవారం నాడు పార్లమెంట్ లో YCP  ఎంపీలు కోటగిరి శ్రీధర్, చింతా అనురాధలు వేసిన ప్రశ్నలకు  కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమాధానమిచ్చారు. AP High Court ను సంప్రదించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి Kiren Rijiju తేల్చి చెప్పారు. ఆ తర్వాతే కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని ఆయన కోరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తీసుకు వచ్చింది. అమరావతిలో శాసన రాజధాని, కర్నూల్ లో న్యాయ రాజధాని, విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ వేదికగా జగన్ ప్రకటించారు.ఏపీకి మూడు రాజధానుల విషయాన్ని 2019 డిసెంబర్ 17న ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏపీ అసెంబ్లీలో ప్రకటించారు.

మూడు రాజధానులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. సీఆర్‌డీఏ చట్టం రద్దుతో పాటు పరిపాలనా వికేంద్రీకరణ చట్టాలను కూడా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే  మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రాజధాని రైతులతో పాటు పలు పార్టీలు కూడా ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.ఈ పిటిషన్లపై విచారణ నిర్వహించిన ఏపీ హైకోర్టు  ఈ ఏడాది మార్చి 3న కీలక తీర్పును ఇచ్చింది. 

 సీఆర్డీఏ చట్టం ప్రకారంగానే ముందుకు వెళ్లాలని హైకోర్టు తేల్చి చెప్పింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారంలో అసెంబ్లీకి లేదని తేల్చి చెప్పింది. మూడు నెలల్లో రైతులకు ప్లాట్లను అభివృద్ది చేసి ఇవ్వాలని కూడా ఏపీ హైకోర్టు  ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర రాజధాని విషయమై ప్రఁభుత్వం తీరును విపక్షాలు తీవ్రంగా తప్పు బడుతున్నాయి. మూడు రాజధానులు చేసి తీరుతామని వైసీపీ నేతలు చెబుతున్నారు. విశాఖ నుండి పరిపాలనకు వైసీపీ సర్కార్ ఏర్పాట్లు చేస్తుందనే సంకేతాలను కూడా ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ప్రకటనలు చేశారు.

మూడు రాజధానుల విషయమై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయలేదని కూడా ఏపీ హైకోర్టులో అమరావతి రైతులు కోర్టు ధిక్కార పిటిషన్లు కూడా దాఖలు చేశారు.  ఈ విషయమై ఈ నెల 12న ఏపీ హైకోర్టులో విచారణ జరగింది. అయితే అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్టేటస్ రిపోర్టును అదే రోజున ప్రభుత్వం సమర్పించింది. అయితే స్టేటస్ రిపోర్టు విషయమై నివేదికను పరిశీలించిన తర్వాత ఈ పిటిషన్లపై విచారణ నిర్వహిస్తామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios