మద్యం ప్రియులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మద్యం ధరలను తగ్గించింది. మీడియం, ప్రీమియం బ్రాండ్ ధరలను సుమారు 25 శాతం తగ్గించింది. 

రూ. 250-300 వరకు ఉన్న మద్యం బాటిల్ పై ధరను రూ 50 తగ్గించింది. ఐఎంఎఫ్ఎల్ లిక్కర్ తో పాటు, విదేశీ మద్యం ధరలను కూడ  తగ్గించింది.రూ. 50 నుండి రూ. 1350 వరకు వివిధ కేటగిరిల్లో మద్యం ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.బీరు,రెడీ టూ డ్రింక్ మ‌ద్యం ధ‌ర‌ల్లో  మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.  తగ్గిన ధరలను ఈ నెల 30వ తేదీ నుండి అమల్లోకి రానున్నాయి.

దశలవారీగా రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 2019 అక్టోబర్ మాసంలో ఈ ఏడాది మే మాసంలో మద్యం ధరలను ప్రభుత్వం పెంచింది. మద్యం ధరల పెంపు సుమారు 75 శాతంగా ఉంది.

ఏపీకి సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల్లో తక్కువ ధరకే మద్యం దొరుకుతుండడంతో పెద్ద ఎత్తున ఏపీకి అక్రమంగా లిక్కర్ ను తరలిస్తున్నారు.

also read:ఏపీ మద్యం ప్రియులకు జగన్ సర్కార్ షాక్: ఇతర రాష్ట్రాల డోర్స్ క్లోజ్

మరో వైపు ప్రతి ఒక్కరూ కూడ 3 మద్యం బాటిల్స్ తీసుకొచ్చుకొనే వెసులుబాటును కూడ ఇటీవలనే ప్రభుత్వం ఎత్తివేసింది.ఇతర రాష్ట్రాల నుండి  మద్యం బాటిల్స్ తీసుకొచ్చుకోవాలంటే పర్మిట్ తీసుకోవాల్సిందే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల ద్వారా అక్రమ మద్యానికి చెక్ పెట్టవచ్చని ప్రభుత్వం తెలిపింది.

రాష్ట్రంలో మద్యం ధరలను  తగ్గించడం ద్వారా అక్రమాలకు చెక్ పెట్టవచ్చని సర్కార్ భావిస్తోంది.

రాష్ట్రంలో మద్యం ధరల తగ్గుదల ఇలా ఉంది.