కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) భయాందోళన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra pradesh Government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కోవిడ్ (Covid) వ్యాప్తి కట్టడికి ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.
కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra pradesh Government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి కట్టడికి ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్ర హోం శాఖ, డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకపోతే రూ. 100 జరిమానా విధించనున్నట్టుగా తెలిపింది. మాస్క్‌లు లేకుండా పౌరులను దుకాణాలు, వాణిజ్య ప్రదేశాల్లోకి అనుమతిస్తే యజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
మాస్క్ లేని వారికి దుకాణాలు, వాణిజ్య ప్రదేశాల్లోకి అనుమతిస్తే యజమాన్యానికి రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు జరిమానా విధించనున్నట్టుగా తెలిపింది. ఉల్లంఘనలకు పాల్పడ్డ సంస్థలను రెండు రోజులు మూసివేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. దుకాణాలు, వాణిజ్య సముదాయాల్లో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే వాట్సాప్ ద్వారా నెంబర్ 8010968295కు తెలియజేయాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. ఉద్దేశపూర్వకంగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే విప్తతు నిర్వహణ, ఐపీసీ సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేయనున్నట్టుగా వెల్లడించింది. ప్రభుత్వ మార్గదర్శకాలను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఆదేశించింది.
